బిగ్ బాస్ బ్యూటీ నేహా చౌదరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. యాంకర్ గా, యాక్టర్ గా డ్యాన్సర్, మోడల్ గా అందరికి పరిచయమే..ఇంట్లో పెళ్లి చేసుకోమని పోరు పెడుతుంటే నావల్ల కాదు బాబోయ్ అని బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో పాల్గొంది. ఈ షో ప్రారంభంలోనే ఎలిమినేట్ అయిన నేహా బిగ్‌బాస్ నుంచి బయటకు రాగానే ఏడడుగుల బంధంలో అడుగుపెట్టింది. తన చిన్ననాటి స్నేహితుడు అనిల్‌ను పెళ్లాడింది.. బిగ్ బాస్ గ్రాండ్ ఫైనాలే రోజే పెళ్లి చేసుకుంది.. అందుకే ఆ షోలో కనిపించలేదు..
పెళ్లి తర్వాత ఆన్ స్క్రీన్ దూరంగా ఉన్న ఈ అమ్మడు ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన భర్తతో కలిసి చేసిన రీల్స్ వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది నేహా. తాజాగా తన భర్తను ద్వేషిస్తున్నానంటూ ఓ పోస్ట్ పెట్టింది. ‘నిన్ను నేను ఎంతగానో ద్వేషిస్తున్నాను. ఎందుకంటే.. ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నాను. అందుకేనేమో దీన్ని పెళ్లి అని పిలుస్తారు అంటూ ఓ పోస్ట్ ను పెట్టింది.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఆ పోస్ట్ లో.. నువ్వు ఎంత పెద్దగా గురక పెట్టినా, నన్ను కారు నడపనివ్వకపోయినా, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్ నాకివ్వకుండా నువ్వొక్కడివే తినేసినా.. నేను చెప్పిన పని ఏదీ చేయకపోయినా ప్రేమిస్తూనే ఉంటాను. కానీ నువ్వు నాకు సారీ చెప్పి, ఇంకెప్పుడూ అలా నడుచుకోనని ఒట్టేస్తావు చూడు.. మాటిచ్చిన కొన్ని నిమిషాల్లోనే మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తావు. అయినా సరే.. నిన్ను చాలా.. చాలా… చాలా…. ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించే విధానానికి నేను ఎప్పుడో ఫిదా అయ్యాను. నువ్వు ఎప్పటికీ నావాడివే’ అని రాసుకొచ్చింది..మొత్తానికి పోస్ట్ వైరల్ గా మారింది..ఇది ఎందుకు పెట్టిందో అని నెటిజన్లు ఆలోచనలో పడ్డారు..