పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో హృదయ విదారకమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఉద్యోగులు ఇస్లామాబాద్ నుంచి స్కర్దుకు వెళ్తున్న ఆరేళ్ల చిన్నారి మృతదేహాన్ని విమానంలోకి తీసుకెళ్లడం మర్చిపోయారు. విమాన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆరేళ్ల బాలుడి మృతదేహం విమానాశ్రయంలోనే ఉండిపోయింది. డాన్ కథనం ప్రకారం.. అంతకుముందు చిన్నారి తల్లిదండ్రులు విమానం ఎక్కారు. అయితే.. పిఐఎ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మరణించిన చిన్నారిని ఇస్లామాబాద్ విమానాశ్రయంలో ఉంచారు. దీంతో.. ఎయిర్‌లైన్స్ కంపెనీ ఉద్యోగులు తన కుమారుడి మృతదేహాన్ని విమానం ఎక్కించలేదని తెలియగానే షాక్‌కు గురై స్పృహతప్పి పడిపోయారు.
Yogi Adityanath: ఈ ఎన్నికలు రామ భక్తులకు, రామ ద్రోహులకు మధ్య జరుగుతోంది..
వివరాల్లోకి వెళ్తే.. ఖర్మంగ్ జిల్లా కాట్షి గ్రామానికి చెందిన ముహమ్మద్ అస్కారీ యొక్క ఆరేళ్ల కుమారుడు ముజ్తబాకు స్కర్డులోని ఆసుపత్రిలో కణితి ఉన్నట్లు నిర్ధారణ అయింది. నెల రోజుల క్రితం డాక్టర్లు ముజ్తబాను చికిత్స నిమిత్తం రావల్పిండికి రెఫర్ చేశారు. దీంతో.. తండ్రి ముహమ్మద్ అస్కారీ, తల్లి ముజ్తబాను రావల్పిండికి తీసుకువెళ్లారు. అక్కడ బెనజీర్ భుట్టో ఆసుపత్రిలో కొన్ని వారాలపాటు చికిత్స పొందుతున్నాడు. కాగా.. చిన్నారి ముజ్తబా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.
అయితే.. ఎండల దృష్ట్యా తమ బిడ్డ మృతదేహాన్ని శుక్రవారం విమానం ద్వారా వారి స్వగ్రామం కాట్షికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. చిన్నారి తల్లిదండ్రులు, మరొక బంధువు శుక్రవారం ఉదయం ఇస్లామాబాద్ నుండి స్కర్దుకు PK-451 విమానంలో టిక్కెట్లను ధృవీకరించారు. వారు ఉదయం 6 గంటలకు మృతదేహాన్ని ఇస్లామాబాద్ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. SOPలు, ఎయిర్‌లైన్ నిబంధనలను అనుసరించి.. మృతదేహానికి కార్గో ప్రక్రియను పూర్తి చేసి చెల్లింపు చేశారు. అయితే.. పొరపాటున చిన్నారి మృతదేహాన్ని విమానం ఎక్కించలేదని.. ఇస్లామాబాద్ విమానాశ్రయంలోనే ఉన్నట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది.
Mamata Banerjee: ఆ గవర్నర్ ఉన్నంతవరకు రాజ్‌భవన్‌కు వెళ్లను
ఈ వార్తతో తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపానికి గురై విలపించారు. దీంతో వారు PIA యాజమాన్యం నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. పిఐఎ, సివిల్ ఏవియేషన్ అథారిటీ మరియు ఇతర విభాగాల అధికారులు తల్లిదండ్రులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. వారి తప్పును అంగీకరించారు. శనివారం తమ చిన్నారి మృతదేహాన్ని అప్పజెప్పుతామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. కాగా.. బాడీని లోడ్ చేయకపోవడానికి విమానాశ్రయంలో కార్గో నిర్వహించే కంపెనీదే బాధ్యత అని పిఐఎ అధికారులు తెలిపారు. ఈ నిర్లక్ష్యానికి సంబంధించి వారిపై చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.