NTV Telugu Site icon

Uttar Pradesh: యూపీలో వైద్యుడి నిర్లక్ష్యం.. ఆపరేషన్‌ చేసి కడుపులో దూది మర్చిపోయిన డాక్టర్

Heart Surgery

Heart Surgery

వైద్యులు శస్త్రచికిత్స చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. కొంత మంది వైద్యులు ఆపరేషన్ చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండి కడుపులో శస్త్రచికిత్స సమయంలో ఉపయోగించే పలు వస్తువులు మర్చిపోతుంటారు. తాజాగా యూపీలో ఇలాంటి ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఓ వైద్యుడు చేసిన నిర్వాకం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. పిత్తాశయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి లోహియానగర్‌లోని స్థానిక నర్సింగ్‌ హోంలో చేరారు. అతడికి నెల క్రితం వైద్యుడు ఆపరేషన్‌ కూడా చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యి ఇంటికి వెళ్లినా.. ఎంతకీ ఆరోగ్యం కుదుటపడకపోగా మరింత క్షీణించడంతో అతడి కుటుంబం మరో ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించింది.

READ MORE: Mumbai : భార్య రాలేదన్న కోపంలో.. 7చోట్ల బాంబులు పెట్టానంటూ స్టేషన్ కు ఫోన్ చేసిన భర్త

ఈ క్రమంలో విస్తుపోయే నిజం వెలుగుచూసింది. ఆయన కడుపులో దూది ఉన్నట్లు వైద్య పరీక్షల్లో బయటపడింది. అక్కడి వైద్యులు ఆపరేషన్‌ చేసి దూదిని తొలగించారు. అయితే తప్పు చేసినా, ఆస్పత్రి వర్గాలు అంగీకరించడం లేదని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు లోహియానగర్‌ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం రోగి పరిస్థితి బాగానే ఉంది.

కాగా.. తెలంగాణాలోని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది క్రితం ఇలాంటి ఉదాంతం వెలుగుచూసింది. లయా అనే గర్భిణి పురుటి నొప్పులతో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో దూదిను మరిచిపోయారు. ఇంటికి వెళ్లిన లయా మూత్ర విసర్జన చేయడం, కడుపులో నొప్పి రావడంతో అస్వస్థతకు గురై, మరో ఆస్పత్రికి వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది.