NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్‌లైన్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET UG 2026: మెడికల్ సీటు సాధించాలనే లక్షలాది మంది విద్యార్థుల కలలపై ‘నీట్ యూజీ 2026’ పేపర్ లీక్ ఉదంతం నీళ్లు చల్లింది. కేవలం అనుమానాలుగా మొదలైన ‘గెస్ పేపర్’ వ్యవహారం చివరకు దేశవ్యాప్త సంచలనానికి, పరీక్ష రద్దుకు దారితీసింది. అసలు మే 3న పరీక్ష జరిగినప్పటి నుంచి మే 12న రద్దు అయ్యే వరకు ఏం జరిగిందో ఒకసారి పరిశీలిద్దాం.. మే 3న సుమారు 22 లక్షల మంది విద్యార్థులు ఎంతో ఆశతో ఈ పరీక్ష రాశారు. ఆ సమయంలో జీపీఎస్ ట్రాకింగ్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఏఐ నిఘా, 5జీ జామ్మర్లు వంటి భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఎన్టీఏ (NTA) భావించింది. కానీ, మే 6, 7 తేదీల్లో ఆన్లైన్ వేదికగా ఆన్సర్ కీలు, ఇతర చర్చలు మొదలయ్యాయి. దీంతో అసలు కథ బయటపడింది. రాజస్థాన్‌లో పరీక్షకు ముందే చలామణి అయిన ఓ గెస్ పేపర్ లేదా ప్రాక్టీస్ బ్యాంక్, అసలు పరీక్షా పత్రంతో అచ్చుగుద్దినట్లు సరిపోలింది. ఈ విషయాన్ని విద్యార్థులు, కోచింగ్ సెంటర్లు గుర్తించాయి.
ఒక్కసారిగా విద్యార్థులు ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. ఈ ఫిర్యాదులు తీవ్రమవ్వడంతో మే 7న ఎన్టీఏ రంగంలోకి దిగింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్ నుంచి అందిన సమాచారం ఆధారంగా మే 8న ఈ కేసును స్వతంత్ర విచారణ కోసం కేంద్ర ఏజెన్సీలకు అప్పగించింది. మే 10న రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) ఈ అక్రమాలపై బహిరంగంగా విచారణ ప్రారంభించడంతో పరిస్థితి మరింత ముదిరింది. పరీక్షకు ముందు సుమారు 400 ప్రశ్నలు సర్క్యులేట్ అయ్యాయని, అందులో బయాలజీ, కెమిస్ట్రీకి చెందిన 100కి పైగా ప్రశ్నలు అసలు పేపర్లోని ప్రశ్నలతో సరిపోలుతున్నాయని ఏడీజీపీ విశాల్ బన్సాల్ వెల్లడించారు. మే 11 నాటికి ఈ వివాదం పతాక స్థాయికి చేరింది. అసలు పేపర్లోని 180 ప్రశ్నలకు గానూ.. ఏకంగా 135 ప్రశ్నలు (90 బయాలజీ, 45 కెమిస్ట్రీ) ఆ గెస్ పేపర్లో ఉన్నాయని వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అంటే దాదాపు 600 మార్కుల పేపర్ ముందే బయటకు వచ్చిందన్న మాట.
Also Read
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
ఈ పరిణామాలు రాజకీయంగానూ పెను తుఫాను సృష్టించాయి. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వంటి నేతలు విమర్శలు గుప్పించడంతో పాటు 2024 నీట్ కుంభకోణాన్ని గుర్తు చేశారు. రాజస్థాన్ ఎస్ఓజీ ఇప్పటికే 20 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఇవన్నీ కేవలం ఊహాజనిత ప్రశ్నలా లేక నిజంగానే పేపర్ లీక్ అయిందా అనే దానిపై సందిగ్ధత కొనసాగుతున్న తరుణంలో మే 12న ఎన్టీఏ పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి శ్రమించిన లక్షలాది మంది విద్యార్థులు ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి పరీక్ష రాయాల్సి రావడంతో తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుల్లో ఒకవైపు ఊరటనిచ్చినా, మరోవైపు కొంత మందిని తీవ్ర అసహనాన్ని, ఆందోళనను కలిగిస్తోంది. ఇక ఎన్టీవీ త్వరలోనే రీ-ఎగ్జామ్ తేదీలను ప్రకటించనుంది.
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?