నీట్-యూజీ పరీక్షా పత్రం లీక్ అయిన తర్వాత.. నీట్ ఫలితాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థులకు ఈరోజు (జూన్ 23)న రీ-ఎగ్జామ్ నిర్వహించారు. పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5.20 గంటల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన విషయం సంభవించింది. చాలా కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షకు హాజరుకాలేదు. ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 185 మంది అభ్యర్థులు రీ ఎగ్జామ్‌కు హాజరుకావాల్సి ఉండగా.. 70 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు వెలుగులోకి వచ్చింది. చండీగఢ్ లో ఇద్దరు అభ్యర్థుల కోసం మాత్రమే ఓ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ ఇద్దరు అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరు కాలేదు.
READ MORE: Gautam Adani Salary: ఆసియాలో రెండో అత్యంత సంపన్నుడైన.. గౌతమ్ అదానీ జీతం ఎంతో తెలుసా?
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు మారడంతోపాటు మేఘాలయా, హరియాణా, ఛత్తీస్‌గఢ్, సూరత్, చండీగఢ్‌లోని మొత్తం ఆరు ఎగ్జామ్ సెంటర్లలో ఓఎంఆర్ షీట్లు చిరిగిపోవడం, ఒక పేపర్‌కు బదులు మరో పేపర్ ఇవ్వడం, తద్వారా పరీక్ష నిర్వహణలో జాప్యం వంటి కారణాలతో 1,563 మంది అభ్యర్థులకు నష్టపరిహారం కింద గ్రేసు మార్కులు ఇచ్చారు. అయితే ఫలితాల్లో మొత్తం 67 మందికి 720కి 720 మార్కులు రావడం, ఫస్ట్ ర్యాంకు సాధించిన 67 మందిలో గ్రేసు మార్కులతో ర్యాంకు సాధించడంతో వివాదం చెలరేగింది. దీంతో గ్రేస్ మార్కులు రద్దు చేసి మళ్లీ తిరిగి పరీక్ష నిర్వహిస్తామన్న ఎన్టీఏ సిఫార్సుకు సుప్రీంకోర్టు అనుమతివ్వడంతో నీట్ ఎగ్జామ్ జరుగుతోంది.
READ MORE: Prabhutva Junior Kalasala: యూత్ ను ఆకట్టుకుంటున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల
నీట్, యూజీసీ -నెట్ పరీక్షలలో అవకతవకలు జరిగాయన్న వివాదం మధ్య భవిష్యత్తులో పేపర్ లీక్‌ల సంఘటనలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా నిర్వహించే పోటీ, సాధారణ ప్రవేశ పరీక్షలలో చీటింగ్‌లను నిరోధించే లక్ష్యంతో ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నివారణ) చట్టం, 2024ను నోటిఫై చేసింది. మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో నీట్-యూజీ పరీక్ష నిర్వహించగా దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు ఇందులో పాల్గొన్నారు. పరీక్ష ఫలితాలను జూన్ 4న ప్రకటించాల్సి ఉండగా..10 రోజుల ముందుగానే ఫలితాలు విడుదలయ్యాయి.
READ MORE: Canada: కెనడాలో భారతీయ విద్యార్థుల పరిస్థితి ఇది.. కాఫీ షాప్ ఉద్యోగం కోసం బారులు..
ఫలితాల తర్వాత 67 మందికి పైగా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. వారిలో కొందరు ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన వారు కావడంతో పేపర్ లీక్, అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో బీహార్‌లో అక్రమాలు, పేపర్ లీకేజీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనితో పాటు, కొంతమంది అభ్యర్థులు పరీక్షకు ఒక రోజు ముందు తమకు పేపర్ వచ్చిందని పేర్కొంటూ బహిరంగంగా ముందుకు వచ్చారు. ఈ ఆరోపణలు అనేక నగరాల్లో నిరసనలకు దారితీశాయి. పలు హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.