నీట్ పేపర్ లీక్ కేసు సూత్రధారి సంజీవ్ ముఖియా ఎట్టకేలకు అరెస్టు అయ్యాడు. నీట్ పేపర్ లీక్ పై ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్న బీహార్ ఆర్థిక నేరాల విభాగం (EOU).. గురువారం రాత్రి పాట్నాలోని సగుణ మోడ్ ప్రాంతానికి చెందిన సంజీవ్ ముఖియాను అరెస్టు చేసింది. ఈ ఆపరేషన్‌లో దానాపూర్ పోలీసులు కూడా ఈఓయూకి సహకరించారు.