Neeraj Chopra Wife: రూ.1.5 కోట్ల జాబ్ ఆఫర్‌ను వదులుకున్న నీరజ్ సతీమణి.. ఎందుకో తెలుసా?
- సిమ్లాలో నీరజ్ చోప్రా, హిమానీ వివాహం
- ప్రస్తుతం యూరప్‌లో నీరజ్, హిమానీ
- రూ.1.5 కోట్ల జాబ్ ఆఫర్‌ను వదులుకున్న హిమానీ
- టెన్నిస్ కెరీర్‌కు హిమానీ వీడ్కోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neeraj Chopra Wife Himani Mor Quits Tennis and Job: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈఏడాది ఆరంభంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తన స్నేహితురాలు హిమానీ మోర్‌ని 2025 జనవరి 16న సిమ్లాలో వివాహం చేసుకున్నాడు. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నీరజ్-హిమానీ పెళ్లి జరిగింది. ప్రస్తుతం నీరజ్ చోప్రా యూరప్‌లో శిక్షణ పొందుతున్నాడు. నీరజ్‌తో పాటే హిమానీ కూడా అక్కడే ఉన్నారు. అయితే హిమానీ రూ.1.5 కోట్ల జాబ్ ఆఫర్‌ను వదులుకుందట. ఈ విషయాన్ని తాజాగా ఆమె తండ్రి స్వయంగా చెప్పారు.
హిమానీ మోర్ తండ్రి చాంద్ మోర్ దైనిక్ భాస్కర్‌తో మాట్లాడుతూ… ‘నీరజ్ చోప్రాతో పెళ్లి తర్వాత హిమానీ తన టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు చెప్పింది. అమెరికాలో రూ.1.5 కోట్ల క్రీడలకు సంబంధించిన ఉద్యోగ ఆఫర్‌ను కూడా తిరస్కరించింది. హిమానీ ఇప్పుడు తన సొంత వ్యాపారంపై దృష్టి సారించింది. తప్పకుండా సక్సెస్ అవుతుంది’ అని చెప్పారు. ప్రస్తుతం నీరజ్ శిక్షణా, డైట్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, క్రీడా ఈవెంట్స్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. యూరప్‌లో ఉన్న హిమానీ.. త్వరలోనే తన సొంత వ్యాపారంలోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
హర్యానాలోని లార్సౌలీలో 1999లో జన్మించిన హిమానీ మోర్ నాలుగో తరగతి చదువుతున్నప్పుడు టెన్నిస్ ఆడటం ప్రారంభించారు. అయితే కుటుంబం మాత్రం బాక్సింగ్, రెజ్లింగ్, కబడ్డీపై దృష్టి పెట్టాలని సూచించింది. హిమానీ మాత్రం టెన్నిస్ ఆడుతానని స్పేటం చేశారు. ఓవైపు టెన్నిస్ ఆడుతూ.. మరోవైపు చదువు కొనసాగించారు. సోనిపట్‌లో స్కూల్ విద్య పూర్తి చేసి.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ అండ్‌ఫిజికల్ సైన్స్‌లో పట్టా అందుకున్నారు. 2018లో హిమానీ ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అరంగేట్రం చేశారు. అదే ఏడాది కెరీర్‌లో ఉత్తమంగా సింగిల్స్ విభాగంలో 42వ, డబుల్స్‌లో 27వ ర్యాంకు సాధించారు. ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.
Also Read: Boy Rape: ఉప్పల్‌లో దారుణం.. 5 ఏళ్ల బాలుడిపై అత్యాచారం, హత్య!
ఫ్రాంక్లిన్ పియర్స్ విశ్వవిద్యాలయం (న్యూ హాంప్‌షైర్) నంచి స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్ మేనేజ్‌మెంట్ అండ్ హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్‌లో హిమానీ మోర్ డబుల్ ఎంబీఏ చేశారు. అంతేకాదు సౌత్-ఈస్టర్న్ లూసియానా విశ్వవిద్యాలయం నుంచి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేశారు. యుఎస్‌లో ఉన్నప్పుడు మహిళా టెన్నిస్ జట్టు మేనేజర్, అసిస్టెంట్ కోచ్‌గా కూడా పనిచేశారు. పెళ్లి అనంతరం అన్ని వదిలేసిన హిమానీ.. సొంత వ్యాపారంపై దృష్టి సారించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!