Neeraj Chopra: ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు భారత సైన్యంలో అరుదైన గౌరవం దక్కింది. భారత సైన్యం ఆయనకు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సమక్షంలో నీరజ్ చోప్రా ఈ గౌరవాన్ని అందుకున్నారు. క్రీడల్లో నీరజ్ సాధించిన అసాధారణ విజయాలు, కోట్లాది మంది యువ భారతీయులకు ఆయన స్ఫూర్తిగా నిలిచినందుకు గుర్తింపుగా ఈ హోదాను అందించారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన క్రీడాకారులకు మాత్రమే లభించే ఈ గౌరవ ర్యాంకును అందుకున్న కొద్దిమంది ప్రముఖుల లిస్ట్ లో నీరజ్ కూడా చేరిపోయారు.
నెవ్వర్ బిఫోర్.. రూ.29,000 భారీ డిస్కౌంట్ తో Samsung Galaxy S24 FE 5G మొబైల్ అమ్మకాలు..!
ఇకపోతే, ఇండియన్ ఆర్మీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా (Naib Subedar ర్యాంక్‌లో) నీరజ్ చోప్రా 2016, ఆగస్టు 26న సైన్యంలో చేరారు. అందిన సమాచారం మేరకు, ఆయనకు ఈ లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదా నియామకం ఏప్రిల్ 16 నుంచే అమలులోకి వచ్చింది. జావెలిన్ త్రోలో ఆయన ప్రదర్శనకు గానూ 2018లో అర్జున అవార్డు, 2021లో ఖేల్ రత్న అవార్డు అందుకున్నారు. అదే సంవత్సరం ఆయన సుబేదార్ ర్యాంక్‌కు పదోన్నతి పొందారు. ఇక టోక్యో 2020 ఒలింపిక్స్‌లో చారిత్రాత్మక బంగారు పతకం గెలిచిన తర్వాత 27 ఏళ్ల ఈ భారతీయ అథ్లెట్‌కు భారత సైన్యం 2022లో పరమ విశిష్ట సేవా మెడల్ ను చోప్రాకు ప్రదానం చేశారు అధికారులు. అదే సంవత్సరం ఆయన సుబేదార్ మేజర్ ర్యాంక్‌కు పదోన్నతి పొందడమే కాక.. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారలలో ఒక్కటైనా పద్మశ్రీని కూడా అందుకున్నారు.