Site icon NTV Telugu

Sharad Pawar: మాయవతి ఏ వైపు ఉందో క్లారిటీ లేదు.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా?

Sharad Pawar

Sharad Pawar

Sharad Pawar: బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఎవరితో ఉన్నారనే దానిపై ప్రశ్నార్థకంగా ఉందని, ఆమె బీజేపీతో పొత్తు పెట్టుకుందనే ఊహాగానాలు ఉన్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ బుధవారం అన్నారు. రేపు ముంబయిలో ప్రారంభం కానున్న ఇండియా కూటమి కీలక సమావేశానికి ముందు జరిగిన విలేకరుల సమావేశంలో శరద్‌పవార్ మాట్లాడుతూ.. తాను తటస్థంగా ప్రకటించుకున్న మాయావతిపై కూటమి వైఖరి గురించి అడిగారు.

Also Read: Kiren Rijiju: తుక్డే-తుక్డే గ్యాంగ్ మాటలు నమ్మవద్దు.. చైనా మ్యాప్స్‌పై కేంద్ర మంత్రి

“మాయావతి ఎవరితో ఉన్నారనే దానిపై ఒక ప్రశ్న ఉంది. ఆమె బీజెపీతో ఉన్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. నేను అది నిజమని చెప్పడం లేదు, కానీ దానిపై స్పష్టత రావాలి” అని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ అన్నారు. ఇండియా కూటమి లేదా ఎన్డీయేతో ఎలాంటి పొత్తు లేదని మాయావతి పేర్కొనడంతో శరద్‌ పవార్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రతి ఒక్కరూ తమ పార్టీతో పొత్తుపై ఆసక్తి చూపుతున్నారని, తాను నిరాకరించగా ప్రతిపక్షాలు బీజేపీతో కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తున్నాయని మాయావతి అన్నారు.దేశంలోని రెండు కూటములు ఎక్కువగా పేదల వ్యతిరేక, కులతత్వ, వర్గ, పెట్టుబడిదారీ విధానాలతో కూడిన పార్టీలను కలిగి ఉన్నాయని బీఎస్పీ చీఫ్‌ మాయావతి గతంలో ట్విట్టర్‌ వేదికగా చెప్పారు. ఇవి తమ పార్టీ పోరాడుతున్న విధానాలేనని ఆమె అన్నారు.

2007లో లాగా సమాజంలో నిర్లక్ష్యానికి గురైన కోట్లాది మంది సభ్యులను ఏకం చేయడం ద్వారా రాబోయే లోక్‌సభ, నాలుగు రాష్ట్రాలవ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుంది బీఎస్పీ చీఫ్‌ పోస్ట్ చేశారు. 2019 ఎన్నికల తర్వాత మాయావతి సమాజ్‌వాదీ పార్టీతో పొత్తుకు స్వస్తి పలికారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు.

Exit mobile version