NTV Telugu Site icon

Nedurumalli Ramkumar Reddy : జగన్ అమలు చేస్తున్న పథకాలు.. అభివృద్ధి పాలనే ప్రజా స్పందనకు నిదర్శనం

Ramkumar Reddy

Ramkumar Reddy

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇటీవల వైఎస్సార్‌ నేతన్న నేస్తం నిధులు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా నెల్లూరి జిల్లాలోని వెంకటగిరిలో బహిరంగ సభ నిర్వహించారు. అయితే.. దీనిపై నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వెంకటగిరిలో నేతన్న నేస్తం కార్యక్రమం అనుకున్న దానికంటే విజయవంతమైందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి మా తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి మొదట విగ్రహావిష్కరణ ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా జరగడం సంతోషమన్నారు. మా కుటుంబ సభ్యులతో పాటు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అభిమానుల మనసు పులకించిందని, వెంకటగిరి సభకు వచ్చిన ప్రజలను చూసి ప్రతిపక్ష పార్టీలు కూడా ఆశ్చర్యపోయాయన్నారు.

జగన్ అమలు చేస్తున్న పథకాలు..అభివృద్ధి పాలనే ప్రజా స్పందనకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. వెంకటగిరి నుంచి ఎన్నికల నగరాను జగన్ ప్రారంభించినట్టుగా చెప్పుకోవచ్చని,
నియోజకవర్గంలో ఏడు రోజుల పాటు యువగళం పాదయాత్ర చేసినా ఏడు మంది కూడా వైసీపీ నాయకులు వెళ్ళలేదని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలోని పది స్థానాల్లో గెలుపొందామని, అడిగిన వెంటనే వెంకటగిరి నియోజకవర్గం పై జగన్ వరాల జల్లు కురిపించారని ఆయన అన్నారు. అల్తూరిపాడు జలాశయానికి సవరించిన అంచనాలను ఆమోదించారని, వంద సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడం ప్రజల్లో ఆనందాన్ని నింపిందన్నారు. ముఖ్యమంత్రి మంజూరు చేసిన పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపడతామని, మాటల కంటే అభివృద్ధి పనులకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. పెంచలకోనను మరింత అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే 150 ఎకరాల భూమిని అటవీ శాఖ ఇచ్చిందన్నారు రామ్‌కుమార్‌ రెడ్డి.