NTV Telugu Site icon

Nedurumalli Ramkumar Reddy: ఆనంకు నేదురుమల్లి సవాల్.. దమ్ముంటే వెంకటగిరిలో పోటీ చేయాలి..

Nedurumalli

Nedurumalli

Nedurumalli Ramkumar Reddy: ఆనం రామనారాయణ రెడ్డికి పిచ్చి ముదిరిందని వైసీపీ నేత నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.
తనను రాజ్యాంగేతర శక్తి అని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారని మండిపడ్డారు. అన్నం పెట్టిన చేతినే ఆనం కాటేశాడని నేదురుమల్లి ధ్వజమెత్తారు. ఆయన సోదరుడు విజయ్ కుమార్ రెడ్డి…రామనారాయణ రెడ్డి గురించి చాలా చెప్పారన్నారు.

ముఖ్యమంత్రి జగన్‌ను అనరాని మాటలు అన్నా.. పెద్ద మనసు చేసుకుని టికెట్ ఇచ్చారన్నారు. వెంకటగిరిలో గెలిపించాలని జగన్ తనను ఆదేశించారన్నారు. అందరూ పని చేస్తేనే ఆనం భారీ మెజారిటీతో గెలిచారని ఈ సందర్భంగా చెప్పారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటి ఏడాదిలోనే ప్రభుత్వంపై ఆనం విమర్శలు చేశారని చెప్పారు. వెంకటగిరి నియోజకవర్గంలో నక్సల్స్ ఎక్కడ ఉన్నారన్న ఆయన.. వెంకటగిరి ప్రజలను నక్సల్స్‌ను చేశారని ఆరోపించారు.

Vallabhaneni Vamshi: యార్లగడ్డ, దుట్టా వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ ఘాటు కౌంటర్

వెంకటగిరి మునిసిపాలిటీ సమావేశాలను తన ఇష్టానుసారంగా మార్చారని.. పనులన్నీ తన మనుషులకు ఇచ్చారని నేదురుమల్లి మండిపడ్డారు. రాజ్యాంగేతర శక్తి అంటే మీరేనంటూ.. టీడీపీలో చేరి ఆత్మకూరు నియోజకవర్గ ఇంఛార్జిగా వ్యవహరించారని ఆనం రామనారాయణ రెడ్డిని ఉద్దేశించి నేదురుమల్లి అన్నారు. అప్పట్లో ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారని ఈ సందర్భంగా చెప్పారు. ఏ పదవీ లేకుండా అధికారాన్ని చెలాయించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు లేకుండా ప్రారంభోత్సవాలు చేశారని, శిలాఫలకాలపై పేర్లు వేయించుకున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం గురించి ఆనం మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

40 ఏళ్ల నుంచి మా కుటుంబం వెంకటగిరిలో రాజకీయాల్లో ఉందని నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. తాను పెంచలకోన ఆలయానికి వెళ్తే ఈవోను అక్కడ వుండవద్దని ఆనం ఆదేశించారని ఈ సందర్భంగా ఆరోపించారు. దమ్ముంటే ఆనం వెంకటగిరిలో పోటీ చేయాలని నేదురుమల్లి సవాల్‌ విసిరారు. పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదన్నారు. ఆనం ఆటలు ఇక సాగవని నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

Show comments