E-Waste: ఒక్క ఏడాదిలోనే చెత్తకుప్పలోకి 530 కోట్ల మొబైల్ ఫోన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E -Waste: ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు ఈ-వేస్ట్ బాగా పెరిగిపోతోంది. ఇందులో ఎక్కువగా మొబైలో ఫోన్లే ఉన్నాయి. ఈ ఏడాది ఇలా చెత్తకుప్పలోకి చేరిన ఫోన్లు ఏకంగా 530 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. యునైటెడ్ నేషన్స్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ … ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ-వేస్ట్‌ను ఇది పర్యవేక్షిస్తోంది. ఇలా ఈ-వేస్ట్‌గా మారే ఫోన్లను సరిగా కనుక వాడుకుంటే సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీల్లాంటి వాటికి పనికొస్తాయని యూనిటార్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 17 శాతం ఈ-వ్యర్థాలు మాత్రమే రీసైక్లింగ్ అవుతున్నట్టు యూనిటార్‌కు చెందిన సీనియర్ సైంటిఫిక్ స్పెషలిస్ట్, గ్లోబల్ ఈ-వేస్ట్ మానిటర్ ప్రధాన పరిశోధకుడు డాక్టర్ కీస్ బాల్డే తెలిపారు.
Read Also: Hunger Index: భారత్‌లో ఆకలి కేకలు.. మనకంటే బంగ్లాదేశ్, పాక్ బెటర్
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
మిగిలినవి భూమిలోకి చేరుతున్నాయన్నారు. ఫలితంగా ప్రమాదకరమైన కాలుష్య సమస్యలు తలెత్తడంతోపాటు కాపర్, పల్లాడియం వంటి ఖనిజాలు పెద్దమొత్తంలో వృథా అవుతున్నాయని అన్నారు. మొబైల్ ఫోన్ ఉత్పతిలో భాగంగా జరిగే మైనింగ్, రిఫైనింగ్, ప్రాసెసింగ్ వంటి వాటి కారణంగా 80 శాతం గ్రీన్ హౌస్ ఉద్గారాలు ఉత్పత్తి అవుతున్నట్టు చెప్పారు. పాత ఫోన్లను మళ్లీ ఉపయోగించుకోగలిగితే ఈ ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. యూరప్‌లో 8,755 కుటుంబాల్లో వేస్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఫోరమ్ నిర్వహించిన సర్వేలో ఒక ఇంటిలో సగటున 74 ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నట్టు తేలింది.
Read Also: Sai Dharam Tej: ‘తిక్క’ పిల్ల ప్రేమలో మెగా మేనల్లుడు.. ఇదిగో సాక్ష్యం
వీటిలో ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల, టోస్టర్లు వంటివి ఉన్నాయి. వీటిలో 13 వస్తువుల వరకు పనిచేయకపోయినా ఇంటిలోనే పెట్టుకుంటున్నారు. దీనికి సెంటిమెంట్, మరమ్మతు ఖర్చు లాంటివి కారణం. వీటిలో ఎక్కువగా పాత హెడ్‌ఫోన్లు, రిమోట్‌లు, గడియారాలు, ఎక్స్‌టర్నల్ హార్డ్ డ్రైవ్‌లు, రౌటర్లు, కీబోర్డులు, మౌస్‌లు, పాత ఫోన్లు వంటివి ఉన్నాయి. డాక్టర్ కీస్ బాల్డే దీనిపై మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా నేడు ఈ-వ్యర్థాలు 5.4 టన్నులకు చేరుకున్నట్టు పేర్కొన్నారు. వచ్చే మూడు దశాబ్దాల కాలంలో ఇవి రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
- Tags
- 2022
- e waste
- Five billion
- Phones
- UNITAR
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!