NTV Telugu Site icon

NDRF IG : జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం.. నీ సేవలకు సలాం..

New Project 2024 07 31t095956.085

వాయనాడ్ జిల్లాలో నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, రెస్క్యూ ఆపరేషన్‌లకు ఆటంకం కలుగుతోంది. అయినప్పటికీ అననుకూల వాతావరణం మధ్య తప్పిపోయిన వారి కోసం ఆర్మీ, నేవీ, NDRF రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయి.

సునామీ తరువాత జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(NDRF) ఏర్పడిందని.. ప్రస్తుతం 68 ప్రాంతాల్లో ఎన్‌డీఆర్ఎఫ్ సేవలు అందిస్తోందని ఎన్‌డీఆర్ఎఫ్ డీజీ పీయూష్ ఆనంద్, ఐజీ నరేంద్ర సింగ్ తెలిపారు. 1995లో జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం, కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “2018లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఎన్ఐడీఎమ్ దక్షిణ భారత క్యాంపస్ కు శంఖుస్థాపన చేశాం. 2024 లో ఎన్ఐడీఎమ్ దక్షిణ భారత క్యాంపస్ సిద్ధమైంది. మణిపూర్, త్రిపుర, గుజరాత్, బీహార్, పశ్చిమబెంగాల్, ఏపీలలో ఐదు ప్రధాన వరద ఆపరేషన్లు నిర్వహించాం. హిమాచల్, కేదారనాధ్ లలో క్లౌడ్ బరస్ట్, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనల్లో మేం రెస్క్యూ చేశాం. రీమాల్, డానా, పెంగల్ తుఫాన్ లలో రెస్క్యూ ఆపరేషన్ చేశాం.” అని తెలిపారు.

READ MORE: Manchu Vishnu : శివుని ఆజ్ఞతోనే ‘కన్నప్ప’ చిత్రం రూపుదిద్దుకుంటోంది

ఢిల్లీ కరోల్ బాగ్, ముంబై ఘట్కోపర్ భవనాలు కూలిన ఘటనలలో రెస్క్యూ చేసినట్లు గుర్తు చేశారు. డార్జిలింగ్‌లో జరిగిన రైలు ప్రమాదంలో రెస్క్యూ చేసినట్లు వెల్లడించారు. మహాకుంభమేళా లో సైతం 20 స్వయం ప్రతిపత్తి కలిగిన టీంలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. “మృతుల బాడీలను కూడా కనుగొనేలా మా డాగ్ స్క్వాడ్ ను సిద్ధం చేశాం. బోర్ వెల్ ప్రమాదాల అంశంలో చాలా ఛాలెంజ్ లు ఉంటాయి. బోర్ వెల్ లో పడిపోయిన పిల్లలను బయటకి తీయడంలో అక్కడి భూమి ప్రధాన పాత్ర పోషిస్తుంది. స్థానిక జిల్లా అధికారులు బోర్ వెల్స్ మూయించడంలో ప్రధాన పాత్ర వహించాలి వరదల విషయంలో హెలికాఫ్టర్ లు కూడా వినియోగించాం. చాలామందిని వరదల్లో కోల్పోయాం.. అయినప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ లో ప్రధాన పాత్ర పోషించింది..” అని వెల్లడించారు.

READ MORE: Bhumana Karunakara Reddy: శ్రీవారి ఆలయ సమీపంలో గుడ్డు బిర్యాని.. ఇది టీటీడీ వైఫల్యమే..