NTV Telugu Site icon

NCP Cheif Shard pawar hospitalized : శరద్ పవార్‎కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక.. ఆందోళనలో అభిమానులు

Sharad Pawar

Sharad Pawar

NCP Cheif Shard pawar hospitalized : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. శరద్ పవార్ మూడు రోజుల పాటు చికిత్స పొందనున్నారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా పవార్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్ సీపీ ప్రకటన విడుదల చేసింది. పవార్ వార్తతో ఆయన అభిమానుల్లో ఒక్క సారి అలజడి చెలరేగింది. తమ అభిమాన నాయకుడు త్వరగా కోలుకోవాలని పలువురు కోరుకుంటూ ట్వీట్ చేస్తున్నారు.

Read Also: Gujarat Cable Bridge: గుజరాత్ బ్రిడ్జి ఘటనలో 12మంది బీజేపీ ఎంపీ కుటుంబీకులు

ప్రస్తుతం బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరద్ పవార్ నవంబర్ 3న డిశ్చార్జి కానున్నారని పార్టీ తెలిపింది. అంతవరకు ఆయన పాల్గొనబోయే పార్టీ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత నవంబర్ 4, 5 తేదీల్లో షిర్డీలో జరిగబోయే ఎన్​సీపీ క్యాంపునకు ఆయన హాజరవుతారని తెలిపాయి. గత ఏడాది ఏప్రిల్‌లో శరద్ పవార్ పిత్తాశయ సమస్య కారణంగా బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆయనకు మూడు సర్జరీలు జరిగాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన ఎందుకు ఆసుపత్రిలో చేరారు అనే విషయంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

Read Also: Girl Killed Boyfriend: ప్రియుడ్ని చంపిన ప్రియురాలు.. కేసులో ట్విస్టులే ట్విస్టులు

Show comments