NBK108: బాలయ్య సినిమా రిలీజ్ డేట్ లాక్..పోటీలో మూడు సినిమాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి హీరో బాలయ్య బాబు కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నాడు.. నా ఏజ్ నా కేరీర్ కు అడ్డురాదు అంటూ వరుస సినిమాలను చేస్తున్నాడు.. ఒక్క మాటలో చెప్పాలంటే కుర్ర హీరోలకు టార్గెట్ అవుతున్నాడు.. ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మరింత జోష్‌తో కనిపిస్తున్నారు. ఈ జోష్ తోనే ఈ సంక్రాంతికి గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘వీరసింహారెడ్డి’ అనే సినిమాతో వచ్చారు. దీనికి కూడా భారీ స్పందన దక్కింది. ఫలితంగా ఇది అత్యధిక కలెక్షన్లను వసూలు చేయడంతో పాటు హిట్ అయింది. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న బాలయ్య ప్రస్తుతం తన 108వ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు.
ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇలా ఇప్పటికే దాదాపు 90 శాతం వరకూ టాకీ పార్టును చిత్ర యూనిట్ కంప్లీట్ చేసుకుంది.. మిగిలిన భాగాన్ని త్వరగా పూర్తి చేసేలా డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడు.. అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకులకు ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు..ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ డేట్‌పై తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను ఈ ఏడాది దసరా పండుగ కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ఎప్పుడో డిసైడ్ అయింది. అందుకు అనుగుణంగానే ఈ విషయాన్ని ప్రకటించారు. ఇక, ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా బయటకు వచ్చింది.
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
ప్రస్తుత వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సినిమాను అక్టోబర్ 20న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తారట. ఈ విషయాన్ని టైటిల్ పోస్టర్‌లో రివీల్ చేస్తారని తెలిసింది..ఇక, అదే రోజున రవితేజ ‘టైగర్ నాగేశ్వర్రావు’, రామ్ పోతినేని – బోయపాటి శ్రీను సినిమా, విజయ్ ‘లియో’ సినిమాలు విడుదల కానున్నాయి.. దాంతో సినిమాకు గట్టి పోటి ఏర్పడింది.. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. యంగ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తుంది. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయనున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి..
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!