Site icon NTV Telugu

CM Jagan : సీఎం జగన్‌ చిత్రపటానికి నాయి బ్రాహ్మణులు పాలభిషేకం

Cm Jagan

Cm Jagan

నాయి బ్రాహ్మణులకు రాష్ట్రంలోని ప్రతీ దేవాలయ పాలకవర్గాలలో అవకాశం కల్పిస్తూ కేబినెట్‌ ఆమోదం తెలపడంతో దుర్గగుడి కేశఖండన శాల వద్ద సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు రాష్ట్ర దేవాలయాల జేఏసీ నేతలు. రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్ధవటం యానాదయ్య, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, నగర మేయర్ భాగ్యలక్ష్మి దుర్గగుడి కేశఖండన శాల క్షురకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్ధవటం యానాదయ్య మాట్లాడుతూ.. నాయీ బ్రాహ్మనుల ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని ఆయన అన్నారు.

Also Read : Robbery in Temple : దేవాలయాలే టార్గెట్‌.. హుండీలను బద్దలు కొట్టి

సీఎం జగన్ నాయీ బ్రాహ్మణుల పట్ల అత్యున్నతమైన నిర్ణయం తీసుకున్నారని, ఎన్ని ప్రభుత్వాలు మారినా నాయీ బ్రాహ్మణులను గుర్తించింది లేదన్నారు. గతంలో నాయీ బ్రాహ్మణుల సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెల్తే మమ్మల్ని అవమానకరంగా మాట్లాడారని, ఇదే సేవకులు బానిసలు కాదు పాలకులు చేస్తానన్న సీఎం జగన్ తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. దేవాలయాల్లో మా సమస్యలపై చర్చ జరగేది కాదని, సీఎం జగన్ పాలకవర్గంలో భాగస్వామ్యం చేయడం మరువరానిదన్నారు. రాష్ట్రంలో వెయ్యికి పైగా దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులంతా సీఎం జగన్ కు రుణపడి ఉంటామన్నారు. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం 20 వేల రుపాయలు ఇస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు.

Also Read : Pot Water Benefits: మట్టికుండలోని నీరు తాగడం వల్ల ఇన్ని లాభాలా?

Exit mobile version