ఇటీవల కాలంలో మట్టి పాత్రలతోపాటు.. మట్టి గ్లాసులు, మట్టి బాటిల్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ మట్టి కుండలలో నీళ్లు తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.
వేసవిలో కుండలోని నీరు తాగడం వల్ల గొంతుకు సంబంధించిన సమస్యలు రావు. జలుబు, దగ్గు సమస్యలను తగ్గిస్తుంది.
వేసవిలో కొన్ని వ్యాధులు సూర్యరశ్మి వల్ల సంక్రమిస్తాయి. దీనిని నివారించడానికి మట్టి కుండ నీరు ఉత్తమ సహజ ఔషధం. ఎండదెబ్బకు గురికాకుండా ఉండటానికి ఈ మట్టికుండలోని నీరు మనల్ని రక్షిస్తాయి.
ఆల్కలీన్ శరీరంలో pH స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కుండనీరు తాగడం వల్ల ఇది సహజంగా శరీరానికి లభిస్తుంది.
కుండ నీరు శరీరానికి రోగనిరోధక శక్తిని ఇవ్వడమే కాకుండా ఒక గ్లాసు నీటిలో దాహాన్ని కూడా తీర్చేస్తుంది. ఎసిడిటీని కూడా నివారిస్తుంది.
వేడి రోజులలో మట్టి కుండ నీరు తాగితే.. తేనె వంటి తీయని రుచి ఉంటుందని చెబుతారు. అది నిజం. సహజంగానే మట్టి కుండల్లోని నీరు చల్లగా మారుతుంది. అంతే కాదు ఆ నీటి రుచి కూడా దేనిలో లభించదు.
మట్టి కుండలో నీరు తాగడం వల్ల శరీర జీవక్రియను ప్రేరేపిస్తుంది. దాని పెరుగుదలకు తోడ్పడుతుంది. ఇందులో ఉండే మినరల్స్ జీర్ణ శక్తిని కూడా పెంచుతాయి