NTV Telugu Site icon

Drishti 10: నేవీ కోసం అదానీ గ్రూప్ డ్రోన్ తయారీ.. హైదరాబాద్లో ఆవిష్కరణ..

Drishti 10

Drishti 10

అదానీ గ్రూప్‌ తయారు చేసిన దృష్టి 10 ‘స్టార్‌లైనర్‌’ మానవరహిత వైమానిక వాహనం (UAV)ని భారత నావికాదళ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరి కుమార్‌ బుధవారం హైదరాబాద్ లోని అదానీ ఏరోస్పేస్‌లో ఆవిష్కరించారు. ఈ డ్రోన్లు భారత నౌకా దళ శక్తి సామర్థ్యాలను మరింత పెంపొందించేలా తయారు చేశారు. అంతేకాకుండా.. సముద్రంలో నిఘా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దృష్టి డ్రోన్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించామని హరి కుమార్ వివరించారు. దృష్టి 10 ‘స్టార్‌లైనర్’ అనేది ఒక అధునాతన ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, రికనైసెన్స్ (ISR) ప్లాట్‌ఫారమ్. ఇది అధిక ఓర్పు, పోరాట-నిరూపితమైన, స్వదేశీ అధునాతన వైమానిక వ్యవస్థలను కలిగి ఉంది అని అన్నారు.

హైదరాబాద్లోని అదానీ ఎయిరోస్పేస్ పార్క్ లో జరిగిన కార్యక్రమంలో హరి కుమార్ మాట్లాడుతూ.. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ గత కొన్నేళ్లుగా నిబద్ధతతో, క్రమబద్ధంగా పనిచేస్తున్నదని కొనియాడారు. దృష్టి డ్రోన్లు.. ఇంటెలిజెన్స్, నిఘా, గూఢచర్య (ఐఎస్ఆర్) కార్యకలాపాలలో దేశ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు, సముద్ర జలాల్లో భారత ఆధిపత్యం కొనసాగేందుకు తాజా ఆవిష్కరణ తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఐఎస్ఆర్ టెక్నాలజీలో స్వయం సమృద్ధి దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందన్నారు. ‘దృష్టి’ చేరికతో భారత నౌకాదళం శక్తి సామర్థ్యాలు మరింత పెంపొందుతాయని, నిఘా, గూఢచర్యం విషయంలో నేవీ మరింత పట్టు సాధిస్తుందని చెప్పారు.

Minister Tummala: పండుగ అయిపోగానే రైతుబంధు.. కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్న్యూస్..!

అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇప్పటికే అనేక చిన్న ఆయుధాలు, మానవరహిత వైమానిక వాహనాలు, రాడార్లు, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఏవియానిక్స్, టాక్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్ వంటివి ఉత్పత్తి చేస్తోంది. అదానీ డిఫెన్స్ భారతదేశపు మొట్టమొదటి మానవరహిత వైమానిక వాహనాల తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లోనే స్థాపించింది. ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ ఆయుధాల తయారీ కేంద్రం.

ఈ డ్రోన్ 36 గంటల పాటు విరామం లేకుండా గగనతలం నుంచి పహారా కాయగలదు. 450 కిలోల పేలోడ్‌ను ఇది మోసుకెళ్లగలదు. ఇందులో అధునాతన ఇంటెలిజెన్స్, నిఘా ప్లాట్‌ఫారమ్ ఉన్నాయి. STANAG 4671 సర్టిఫికేషన్‌ కూడా ఉంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఈ డ్రోన్ గగనతలం నుంచి పహారా కాయగలదు.

Sarkaru Naukari : ఓటీటీలోకి వచ్చేస్తున్న సర్కారు నౌకరి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?