Sarkaru Naukari : ఓటీటీలోకి వచ్చేస్తున్న సర్కారు నౌకరి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు రీసెంట్ గా సర్కారు నౌకరి మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సర్కారు నౌకరి మూవీ ఈ ఏడాది జనవరి 1న థియేటర్లలో విడుదల అయింది.సోషల్ మెసేజ్‌కు కమర్షియల్ హంగులను మేళవించి తెరకెక్కిన ఈ మూవీ కి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించాడు. సర్కారు నౌకరి సినిమాను ఆర్కే టెలిషో పతాకంపై సీనియర్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు ప్రొడ్యూస్ చేశారు.. ఈ సినిమాతో భావన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాకు శాండిల్య బొబ్బిలి మరియు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. గతంలో శేఖర్ గంగనమోని పంచతంత్ర కథలు పేరుతో ఓ సినిమా ను చేశాడు.ఇదిలా ఉంటే సర్కారు నౌకరి మూవీ థియేటర్లలో విడుదలైన ఇరవై ఐదు రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నది. సర్కారు నౌకరి సినిమాను జనవరి 26 న ఓటీటీ ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. థియేటర్ రిజల్ట్ కారణంగానే సర్కారు నౌకరి సినిమా తొందరగా ఓటీటీలోకి వచ్చేస్తోన్నట్లు తెలుస్తోంది.సర్కారు నౌకరి సినిమాలో గోపాల్ పాత్ర లో ఆకాష్ గోపరాజు యాక్టింగ్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఎయిడ్స్ వ్యాధి పై అవగాహన కల్పించే ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటాడు గోపాల్. కండోమ్‌లు పంచే ఉద్యోగం చేస్తున్న అతడికి సొసైటీ నుంచి ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి.. అతడిని ఓ అంటరానివాడిగా ఎందుకు చూశారు..ప్రేమించి పెళ్లి చేసుకున్న సత్య (భావన) కూడా గోపాల్ చేస్తోన్న ఉద్యోగం నచ్చక అతడికి ఎందుకు దూరమైంది.. ఎయిడ్స్ వ్యాధి పై అవగాహన కల్పించే ఉద్యోగమే గోపాల్ చేయడానికి అస్సలు కారణం ఏమిటి.. అస్సలు అతడి గతం ఏమిటీ అనేదే సర్కారు నౌకరి మూవీ కథ. అయితే ఈ చిత్ర కథ బాగున్నా కానీ కమర్షియల్ గా మాత్రం ఆశించిన స్థాయి లో విజయాన్ని సాధించలేకపోయింది
Also Read
- Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
- AP Local Body Elections: నేడు సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై విచారణ.. కీలక ఆదేశాలపై ఉత్కంఠ!
- Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
- Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
తాజావార్తలు
-
Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
-
AP Local Body Elections: నేడు సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై విచారణ.. కీలక ఆదేశాలపై ఉత్కంఠ!
-
Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
Theni Jail Escape: తమిళనాడులో కలకలం.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!
ట్రెండింగ్
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!