NTV Telugu Site icon

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నౌకాదళ విన్యాసాలు

Navy Day

Navy Day

Navy Day Celebrations in Visakhapatnam: పర్యాటకులతో సందడిగా ఉండే విశాఖ ఆర్కే బీచ్ యుద్ధ భూమిని తలపించింది. అత్యాధునిక యుద్ధనౌకలు, విమానాలు గర్జించాయి. శత్రువులపై చకచక్యంగా విరుచుకుపడే విన్యాసాలు అబ్బురపరిచాయి. హాక్ విమానాల ఎదురుదాడి నైపుణ్యం., యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ యుద్ధ విమానాలు బాంబుల దాడి వంటివి అబ్బురపరిచాయి. తీరంను రక్షించడంతో పాటు ఎమర్జెన్సీ, రెస్క్యూ ఆపరేషన్స్ సమర్ధవంతంగా నిర్వహించే హాక్,ఏఎల్‌హెచ్‌ హెలీకాఫ్టర్లు విన్యాసాలను ప్రదర్శనకు వచ్చాయి. ఐఎన్ఎస్ శివాలిక్, రణ్ విజయ్, ఢిల్లీ యుద్ధ నౌకలపై హెలీకాప్టర్లు ల్యాండింగ్ ఒళ్ళు గగుర్పాటుకు గురిచేసింది. మార్కోవ్స్, మెరైన్ కమాండోస్ ధైర్య సాహసాలు, పరాచుట బలగాల ఆత్మ స్టైర్యం హైలెట్.

Read Also: Ambati Rambabu: టీడీపీ అలసత్వం వల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నష్టం

నేవీడే వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరయ్యారు. డెమో తర్వాత ఈస్ట్రన్ నేవల్ కమాండ్ హై టీలో గవర్నర్ పాల్గొన్నారు. 1971 డిసెంబర్ 4న భారత నావికాదళం పాకిస్థాన్ పై విరుచుకు పడింది. ఘాజీ జలాంతర్గామితో పాటు కరాచీ పోర్టును ధ్వంసం చేయడం ద్వారా ఆ యుద్ధం విజయంలో కీలక భూమిక పోషించింది. అప్పటి నుంచి ఏటా డిసెంబర్ 4న భారత నవికాదళం నేవీ డేను ఘనంగా జరుపుకుంటోంది. ఈస్ట్రన్,వెస్ట్రన్, సదరన్ కమాండ్‌లో ఈ వేడుకలు నిర్వహిస్తుంటారు. తూర్పు నావికాదళం ముఖ్య స్థావరమైన వైజాగ్‌లో షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన నేవీడే వేడుకలు తుఫాన్ కారణంగా వాయిదాపడ్డాయి. గవర్నర్ సమక్షంలో తమ శక్తి సామర్ధ్యాలను ఈ.ఏన్.సి. ప్రదర్షించింది. నగర ప్రజలతో పాటు వేలాదిగా తారలు వచ్చిన ప్రజలతో ఆర్కే బీచ్ కిక్కిరిసిపోయింది.