Site icon NTV Telugu

Anaganaga Oka Raju : పది షోలు మాత్రమే ఇస్తామన్నారు – నవీన్ పోలిశెట్టి

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి కానుకగా నేడు (జనవరి 14) థియేటర్లలోకి వచ్చేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, మారి దర్శకత్వం వహించారు. వరంగల్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో మొదలైన జోరు, నేడు విడుదల తర్వాత సోషల్ మీడియాలో వినిపిస్తున్న పాజిటివ్ టాక్‌తో మరింత రెట్టింపు అయ్యింది. ఈ నేపథ్యంలో తన కెరీర్ మొదట్లో పడిన కష్టాలను గుర్తుచేసుకుంటూ నవీన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read : Tamannaah : తమన్నా సినిమాకు గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ వార్నింగ్..

ప్రేక్షకులే నా మార్కెటింగ్.. వరంగల్ వేదికగా నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ విడుదల సమయంలో మాకు కనీసం షోలు కూడా దొరకని పరిస్థితి. కేవలం 10 షోలు మాత్రమే ఇస్తామన్నారు. కానీ ప్రేక్షకులు ఆ సినిమాను భుజాల మీద మోసి పెద్ద హిట్ చేశారు. ఆ నమ్మకమే నేడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా ఆలస్యమైనా సరే, ప్రేక్షకులకు నాణ్యమైన వినోదాన్ని పంచాలనే ఉద్దేశంతోనే కష్టపడ్డామని, ప్రత్యేక షోలు చూసిన ప్రతి ఒక్కరు కడుపుబ్బ నవ్వుకున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నవీన్ హ్యాట్రిక్ హిట్ల తర్వాత వచ్చిన ఈ సినిమా కూడా అదే స్థాయిలో అలరిస్తుండటంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Exit mobile version