Site icon NTV Telugu

Bheemavaram Balma: సింగర్‌గా నవీన్‌ పొలిశెట్టి.. ‘అనగనగా ఒకరాజు’ ఫస్ట్ సాంగ్ విన్నారా !

Naveen Polishetty Song

Naveen Polishetty Song

Bheemavaram Balma: తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నవీన్‌ పొలిశెట్టి. ఈ హీరో వెండి తెరపై సినీ ప్రేమికులను పలకరించి చాలా రోజులు అయ్యింది. నవీన్ పొలిశెట్టి చివరగా అనుష్కతో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం తర్వాత నెక్ట్స్ సినిమా స్టార్ట్ చేసే టైంలో ఆయనకు యాక్సిడెంట్ అవ్వడం, దాన్నుంచి కోలుకున్న తర్వాత చేస్తున్న చిత్రం ‘అనగనగా ఒకరాజు’. ఎప్పటి నుంచో నవీన్ పొలిశెట్టిని వెండి తెరపై చూడాలని ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకు సంక్రాంతి గిఫ్ట్‌గా ఈ సినిమా థియేటర్స్‌లోకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది.

READ ALSO: Asim Munir: పాకిస్థాన్ అణు బటన్ మునీర్ చేతుల్లోకి.. కొత్త పాత్రలోకి ఆర్మీ చీఫ్

‘అనగనగా ఒకరాజు’ సినిమాలో నవీన్‌ పొలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి నటిస్తుండగా, ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్‌, ఫార్చ్యూన్‌ 4 సినిమాస్‌ బ్యానర్స్‌పై నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా 14 జనవరి 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి భీమవరం బాల్మ.. అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. చంద్రబోస్ రాసిన ఈ పాటను నవీన్ పోలిశెట్టి, నూతన మోహన్ పాడారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తు్న్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సాంగ్‌కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

READ ALSO: Drishyam 3 Rights: కళ్లు చెదిరే ఆఫర్.. పనోరమా స్టూడియోస్‌‌కు ‘దృశ్యం3’ థియేట్రికల్‌ రైట్స్‌

Exit mobile version