టాలీవుడ్ యువ నటుడు నవీన్ పొలిశెట్టి తన తదుపరి చిత్రం ‘అనగనగా ఒక రాజు’ తో ఈ సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. వరుస విజయాలతో జోరు మీదున్న సమయంలోనే జరిగిన ఒక ప్రమాదం వల్ల ఆయన కొన్ని నెలల పాటు షూటింగ్‌కు దూరమవ్వాల్సి వచ్చింది. ఆ కష్ట కాలం నుంచి కోలుకున్నాక, తనే స్వయంగా బృందంతో కలిసి ఈ సినిమా కథను సిద్ధం చేసుకున్నట్లు నవీన్ తెలిపారు. కేవలం ఆరు నెలల్లోనే సరదాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, పూర్తిస్థాయి వినోదాత్మకమైన కుటుంబ కథా చిత్రమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ అంటేనే వినోదానికి కేరాఫ్ అడ్రస్ కాబట్టి, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి ఈ సమయమే సరైనదని చిత్ర బృందం భావిస్తోంది. అయితే
Also Read : Dulquer Salmaan: తెలుగులో.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దుల్కర్..?
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘రాజు గారి పెళ్లి రిసెప్షన్’ వేడుకలో నవీన్ పొలిశెట్టి తన సంతోషాన్ని పంచుకున్నారు. చిన్నప్పుడు తను ఎవరి సినిమాలైతే థియేటర్లలో చూసి పెరిగారో, ఇప్పుడు అదే స్టార్ హీరోల చిత్రాలతో పాటు తన సినిమా కూడా సంక్రాంతికి విడుదల కావడం గొప్ప విషయమని ఆయన చెప్పుకొచ్చారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించగా, ఈ నెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ పండుగ సీజన్‌లో విడుదలవుతున్న అన్ని సినిమాలు ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, తెలుగు ప్రేక్షకులకు ఇది నిజమైన సినిమా పండుగ అని నవీన్ పేర్కొన్నారు.
