NTV Telugu Site icon

Actor Nani: దసరాకు ధూమ్ ధామ్ చేస్తున్న హీరో నాని

Dasara

Dasara

Actor Nani: నేచురల్ స్టార్ నాని, మహానటి ఫేం కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న సినిమా ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పుడు దసరా సందర్భంగా హీరో నాని తన అభిమానుల కోసం ఫెస్టివల్ గిఫ్ట్ ఇచ్చారు. తన తాజా చిత్రంలోని ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో నాని ఇంతకుముందు చూడని రేంజ్ లో కనిపిస్తారు. ఈ సినిమా నుంచి ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ అంటూ సాగే సాంగ్ ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఊర మాస్ స్టెప్పులతో నాని అదరగొట్టాడు. ఈ సాంగ్ ను మాస్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.

తెలంగాణ రాష్ట్రంలోని సింగ‌రేణి బొగ్గు గ‌నుల బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెర‌కెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి నాని లుక్ రిలీజ్ చేయగా.. అభిమానులకు తెగ నచ్చేసింది. నాని తొలిసారి ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టాడు. నేచురల్ స్టార్ అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ఇదే తొలిచిత్రం.

Read Also: Krithi Shetty : చీరకట్టులో కృతశెట్టి అరాచకం.. కుర్రోళ్లకు జ్వరం వస్తుందేమో..

ఈ సినిమాలో సముద్రఖని, సాయికుమార్, జరీనా వహబ్ లాంటి నటులు ప్రధాన పాత్రంలు పోషిస్తున్నారు. దసరా సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. అచ్చమైన తెలుగు యాసలో నాని డైలగులు ఇరగదీసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా తెలంగాణ సంస్కృతిని కళ్లకుకట్టినట్లు చూపించారు దర్శకుడు శ్రీకాంత్.

అయితే ముందుగా చెప్పిన సమయానికి సాంగ్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేయలేదు. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలోనే ‘కొంచెం ఆలస్యం.. జర్ర ఓపిక పట్టండి. ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్ వస్తుంది..’ అంటూ చిత్రబృందం ట్వీట్ చేసింది. ఆ తరువాత ఇగ షురూ చెయుండ్రి అంటూ సాంగ్‌ను రిలీజ్ చేశారు. వ‌చ్చే ఏడాది శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా మార్చి 30న దస‌రా మూవీ రిలీజ్ కానుంది. శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వర సినిమాస్ బ్యాన‌ర్‌పై చెరుకూరి సుధాక‌ర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.