ఉప్పెన సినిమాలో బేబ‌మ్మ పాత్ర‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని కొల్ల‌గొట్టింది కృతిశెట్టి.

తొలి సినిమాలోనే చ‌క్క‌టి అభిన‌యంతో ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించిన ఈ ముద్దుగుమ్మ‌కు వ‌రుస‌గా అవ‌కాశాలు త‌లుపుత‌ట్టాయి.

ఈ ఏడాది ది వారియ‌ర్‌, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాల‌తో అభిమానులను పలకరించింది.

ఇక కృతి శెట్టి ఇటీవల నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీతో మంచి విజయాన్ని అందుకుంది.

ఈ భామ నాగార్జున, నాగ చైతన్య ఫ్యామిలీ మల్టీస్టారర్ ‘బంగార్రాజు’లో చైతూ జోడిగా నాగ లక్ష్మి పాత్రలో నటించింది.

మరోసారి నాగ చైతన్యతో వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తోంది. దీనికి సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది.

మరోసారి చీరకట్టులోని ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ఇంతకుముందు సారీలోని ఫోటోల తెగ వైరల్‌ అయ్యాయి.

ఇప్పుడు మరోసారి ఈ ఫోటోలకు నెట్టింట తెగ లైక్‌లు, షేర్‌లు కొడుతున్నారు బేబమ్మ అభిమానులు.