Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sesame Laddu: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలో ఒకటి రక్తహీనత (Anemia). అవును.. సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, పని ఒత్తిడి వల్ల వచ్చే నీరసం, అలసట జీవితంలో భాగమైపోయాయి. వీటన్నింటికీ ఖరీదైన మల్టీ విటమిన్ టాబ్లెట్లు వాడకుండా.. వంటింట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే చెక్ పెట్టవచ్చు. రక్తహీనత నుండి బయట పడాలంటే ఐరన్, కాల్షియంలు శరీరానికి అవసరం.
మరి వీటిని ‘నువ్వుల లడ్డు’ రోజు ఒక్కటంటే ఒక్కటి తింటే చాలు.. ఎలాంటి టాబ్లెట్స్ లేకుండానే శరీరానికి కావాల్సిన ఐరన్, కాల్షియంలు సంవృద్ధిగా లభిస్తాయి. ఈ ‘నువ్వుల లడ్డు’ కేవలం రుచి కోసమే కాకుండా, ఆరోగ్యానికి ముఖ్యంగా ఆడవారికి ఐరన్ అందించడంలో ఇది ఒక సూపర్ ఫుడ్. ఇది మహిళల ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో..? దీనిని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో.? ఇప్పుడు చూద్దాం..
Also Read
- Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!
కావలసిన పదార్థాలు:
* తెల్ల నువ్వులు: 1 కప్పు
* తురిమిన బెల్లం: 3/4 కప్పు (తీపిని బట్టి)
* యాలకుల పొడి: అర టీస్పూన్
* నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు (మీకు ఇష్టమైతే)
* ఎండు కొబ్బరి తురుము: 2 టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం:
* ముందుగా స్టవ్ వెలిగించి ఓ బాణలో నువ్వులను వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. నువ్వులు చిటపటలాడి, మంచి సువాసన వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చాలి.
* చల్లారిన నువ్వులను మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి. ఇందులోనే ఎండు కొబ్బరి తురుము కూడా వేసి కలుపుకోవాలి.
* ఇప్పుడు అదే జార్లో తురిమిన బెల్లం, యాలకుల పొడి వేసి మరోసారి తిప్పాలి. నువ్వుల్లోని నూనె, బెల్లం తేమ వల్ల మిశ్రమం ముద్దలా తయారవుతుంది.
* ఇక అంతే ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. అందులో కొద్దిగా వేడి చేసిన నెయ్యి వేసి బాగా కలపాలి. ఇప్పుడు మీకు నచ్చిన పరిమాణంలో లడ్లు చుట్టుకోవాలి. ఈ లడ్లు గాలి తగలని డబ్బాలో భద్రపరిస్తే 15 నుండి 20 రోజుల వరకు తాజాగా ఉంటాయి.
నువ్వుల లడ్డు ఆరోగ్య ప్రయోజనాలు:
* బెల్లం & నువ్వులు రెండింటిలోనూ ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.
* నువ్వుల్లో ఉండే కాల్షియం ఎముకల బలానికి తోడ్పడుతుంది.
* నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించడానికి మరియు హార్మోన్ల సమతుల్యతకు ఇది సహాయపడుతుంది.
* నువ్వులు శరీరంలో వేడిని కలిగిస్తాయి కాబట్టి, గర్భిణీ స్త్రీలు వీటిని తీసుకునే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!