Most Expensive Diamonds: కోహినూర్‌కు బాబు లాంటి వజ్రాలు ఇవే.. ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం! ధర ఎంతో తెలుసా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Most Expensive Diamonds: ఈ రోజుల్లో చాలా మంది బంగారం, వజ్రాలను స్టేటస్ సింబల్‌గా చూస్తున్నారు. కానీ, కొన్ని వజ్రాల ధరలు వింటే సామాన్యులకే కాదు, కోటీశ్వరులకు కూడా చెమటలు పడతాయి. వేల కోట్లు విలువ చేసే ఈ అరుదైన ఆభరణాలను బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుక, కట్టుదిట్టమైన భద్రతలో ఉంచుతారు. భారతదేశంలోని గోల్కొండ గనుల నుంచి వెలికి తీసిన ‘హోప్ డైమండ్’ నుంచి రంగురంగుల పింక్ డైమండ్స్ వరకు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కోహినూర్‌కు బాబు లాంటి వజ్రాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Ajinkya Rahane: నేను క్రికెట్ ఆడటం వారికి నచ్చడం లేదు.. రహానే సంచలన వ్యాఖ్యలు!
Also Read
- Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- 8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్‌పాట్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
1. హోప్ డైమండ్ (Hope Diamond)
ఈ జాబితాలో మొదటి స్థానం మన భారత్‌కు చెందిన హోప్ డైమండ్‌దే. 45.52 క్యారెట్ల బరువున్న ఈ నీలి రంగు వజ్రం గోల్కొండ గనుల్లో దొరికింది. దీని ధర సుమారు 250 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2085 కోట్లు). ప్రస్తుతం ఇది వాషింగ్టన్‌లోని స్మిత్సోనియన్ మ్యూజియంలో ఉంది.
2. గ్రాఫ్ పీకాక్ బ్రోచ్ (Graff Peacock Broach)
నెమలి ఆకారంలో ఉండే ఈ ఆభరణం ఒక ఇంజినీరింగ్ అద్భుతం. ఇందులో 1,305 రంగురంగుల వజ్రాలు ఉన్నాయి. దీని మధ్యలో ఉండే 20 క్యారెట్ల నీలి రంగు వజ్రం.. ఈ ఆభరణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీని విలువ సుమారు 100 మిలియన్ డాలర్లు.
3. విట్టెల్స్‌బాచ్-గ్రాఫ్ డైమండ్ (Wittelsbach-Graff Diamond)
17వ శతాబ్దానికి చెందిన ఈ చారిత్రాత్మక నీలి వజ్రం యూరోపియన్ రాజకుటుంబాల వద్ద ఉండేది. 2008లో దీనిని లారెన్స్ గ్రాఫ్ కొనుగోలు చేసి, మరింత మెరుగుపరిచారు. ప్రస్తుతం దీని ధర సుమారు 80 మిలియన్ డాలర్లు.
4. పింక్ స్టార్ డైమండ్ (Pink Star)
59.60 క్యారెట్ల బరువున్న ఈ పింక్ డైమండ్‌ను తయారు చేయడానికి రెండు ఏళ్లు పట్టిందని సమాచారం. 2017లో హాంగ్‌కాంగ్ వేలంలో ఇది 71.2 మిలియన్ డాలర్లకు అమ్ముడై అప్పట్లో ప్రపంచ రికార్డు సృష్టించింది.
5. ఓపెన్‌హైమర్ బ్లూ (Oppenheimer Blue)
నీలి వజ్రాల ప్రపంచంలో దీనికి ఒక ప్రత్యేక గౌరవం ఉందంటే అతిశయోక్తి కాదు. 14.62 క్యారెట్ల బరువున్న ఈ వజ్రం వేలంలో అమ్ముడైన అత్యంత ఖరీదైన ‘వివిడ్ బ్లూ’ డైమండ్. దీని ధర 57.5 మిలియన్ డాలర్లు.
మిగిలిన టాప్ ఆభరణాలు ఇవే..
6. మెమరీ ఆఫ్ ఆటమ్ లీవ్స్ (Memory of Autumn Leaves) : మెమరీ ఆఫ్ ఆటమ్ లీవ్స్ అనేవి రెండు వేర్వేరు రంగులు (పింక్ & బ్లూ) కలిగిన ఇయర్ రింగ్స్. 2017లో వీటిని జంటగా వేలంలో విక్రయించారు. ఆ టైంలో ఇవి సుమారుగా రూ.478 కోట్లకు అమ్ముడయ్యాయి.
7. ఎల్-ఇన్ కంపేరబుల్ (L’Incomparable) : దీని కథ చాలా విచిత్రంగా ఉంటుంది. కాంగోలో ఒక చిన్నారికి చెత్త కుప్పలో దొరికిన 407 క్యారెట్ల పసుపు రంగు వజ్రం ఈ నెక్లెస్ ప్రధాన ఆకర్షణ. దీని విలువ రూ.458 కోట్లు.
8. విన్స్టన్ పింక్ లెగసీ (Winston Pink Legacy) : 18.96 క్యారెట్ల బరువున్న ఈ వజ్రం అద్భుతమైన రంగుకు ప్రసిద్ధి చెందింది. ఈ వజ్రం 2018లో 50.7 మిలియన్ డాలర్లకు అమ్ముడై (రూ.420 కోట్లు) చరిత్ర సృష్టించింది.
9. బ్లూ మూన్ ఆఫ్ జోసెఫిన్ (Blue Moon of Josephine) : హాంగ్‌కాంగ్ బిలియనీర్ జోసెఫ్ లావ్ తన కుమార్తె జోసెఫిన్ కోసం దీనిని 48.4 మిలియన్ డాలర్లకు (రూ. 400 కోట్లు) కొనుగోలు చేశారు.
10. గ్రాఫ్ పింక్ (Graff Pink): 24.78 క్యారెట్ల ఈ పింక్ డైమండ్ ప్రపంచంలోనే అత్యంత అందమైన వజ్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. దీని విలువ సుమారుగా రూ.385 కోట్లు ఉంటుందని అంచనా.
నిజానికి ఈ ఆభరణాలు కేవలం అలంకారాల కోసం మాత్రమే కాదు, చరిత్రకు, సంపదకు ప్రతీకలుగా నిలుస్తాయి. ముఖ్యంగా భారతదేశానికి చెందిన హోప్ డైమండ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలవడం ఇండియన్స్‌కు గర్వకారణం.
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?