Home Remedies For Dark Spots: మెరిసే చర్మం కావాలంటే ఈ సహజ చిట్కాలు పాటించాల్సిందే!
- మెరిసే చర్మం కావాలంటే సహజ చిట్కాలు మీకోసం.
- మార్కెట్ ఉత్పత్తులపై ఆధారపడకుండా ఇంటిలో సహజంగా లభించే పదార్థాలను ఉపయోగించడం ఆరోగ్యానికి మేలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Remedies For Dark Spots: ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన, మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. దీనికోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే ఇందులో కొన్ని రసాయన ఉత్పత్తులు ఎక్కువగా వాడటం వల్ల చర్మంపై దుష్ప్రభావాలు చూపే అవకాశముంది. అందుకే, సహజ పద్ధతులతో చర్మ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఇంటిలోనే సులభంగా లభించే పదార్థాలతో మచ్చలు, ముడతలు, చర్మసంబంధ సమస్యలను తగ్గించుకోవచ్చు. మరి అవేంటో ఒకసారి చూద్దామా..
చందనం (గంధపు) పొడి:
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
గంధపు పొడి చర్మాన్ని తేమగా ఉంచి, సహజ మెరుపును అందిస్తుంది. ఇది ముఖ్యంగా టాన్ తొలగించడానికి, మొటిమల మచ్చలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక చెంచా గంధపు పొడిని రోజ్ వాటర్ లేదా దోసకాయ రసంతో మిక్స్ చేసి పేస్ట్ తయారు చేయాలి. ముఖానికి అప్లై చేసి, పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది.
Also Read: Threatening calls: మహిళా తహసీల్దార్‌కు బెదిరింపు కాల్స్.. మేం వస్తున్నాం.. బయటకు రండి..!
బంగాళాదుంప:
బంగాళాదుంపలో విటమిన్లు, యాంటీ-ఆక్సిడెంట్లు, పిండి పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మంపై మచ్చలను తగ్గించడంలో, అలాగే రంగును మెరిపించడంలో సహాయపడతాయి. ఇందుకోసం ఒక బంగాళాదుంపను తురుముకొని దాని రసాన్ని తీసుకోవాలి. దూది సహాయంతో ఈ రసాన్ని ముఖానికి అప్లై చేయాలి. అలా 15-20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కాకున్నా బంగాళాదుంప ముక్కలను నేరుగా ముఖంపై రాసినా చర్మానికి మేలు జరుగుతుంది.
పచ్చి పాలు:
పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది చర్మాన్ని సహజంగా నిగనిగలాడేలా మార్చడంలో సహాయపడుతుంది. ఇందుకోసం పచ్చి పాలను కాటన్ సహాయంతో ముఖంపై అప్లై చేయండి. ఆ తర్వాత 10 నుండి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి 3-4 సార్లు చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
Also Read: Priyamani: ఆయన సినిమాలో నటించడానికి అదృష్టం ఉండాలి : ప్రియమణి
పసుపు పొడి:
పసుపులో సహజమైన యాంటీ-సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం కొద్దిగా పసుపు పొడిని పాలలో లేదా నిమ్మరసంలో కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారంలో 2-3 సార్లు చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.
మెరిసే చర్మాన్ని పొందడం కోసం మార్కెట్ ఉత్పత్తులపై ఆధారపడకుండా ఇంటిలో సహజంగా లభించే పదార్థాలను ఉపయోగించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పై చెప్పిన సహజ చిట్కాలను పాటిస్తూ.. సమతుల్య ఆహారం తీసుకుంటూ, మళ్లీ మళ్లీ నీరు తాగడం ద్వారా ఆరోగ్యవంతమైన, కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..