Site icon NTV Telugu

Remal cyclone: బెంగాల్ వైపు దూసుకొస్తున్న తుఫాన్.. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అలర్ట్

Rema

Rema

రెమల్ తుఫాన్ పశ్చిమ బెంగాల్ వైపు దూసుకొస్తోంది. రెమల్ తుఫాను ఆదివారం పశ్చిమ బెంగాల్‌కు చేరుకోనుంది. దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారనుందని వెల్లడించింది. ఆదివారం నాటికి బంగ్లాదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ తీరాలకు చేరుకుంటుందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం తుఫాన్ తీరం దాటినప్పుడు గంటకు 102 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Kia EV3: కియా ఈవీ3 రివీల్.. ఒక్క ఛార్జ్‌తో 600 కి.మీ రేంజ్..

ఇక మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులంతా తిరిగి తీరానికి రావాలని సూచించింది. ఎవరూ వేటకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చింది. మే 27 వరకు బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని సూచించింది. మే 26-27 తేదీల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరం, త్రిపుర, దక్షిణ మణిపూర్‌లోని కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: Shabbir Ali: ముస్లిం రిజర్వేషన్ పై మాట్లాడితే పరువు నష్టం దావా వేస్తా.. ప్రధానిపై షబ్బీర్ అలీ మండిపాటు

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై కమిటీ సమావేశమైంది. కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా అధ్యక్షతన నేషనల్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ కమిటీ శుక్రవారం సమావేశమైంది. 12 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు మోహరించగా.. 5 అదనపు బృందాలను సిద్ధంగా ఉంచారు. నౌకలు, విమానాలతో పాటు ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్‌కు చెందిన రెస్క్యూ మరియు రిలీఫ్ టీమ్‌లను సిద్ధంగా ఉంచినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.

ఇది కూడా చదవండి: Shabbir Ali: ముస్లిం రిజర్వేషన్ పై మాట్లాడితే పరువు నష్టం దావా వేస్తా.. ప్రధానిపై షబ్బీర్ అలీ మండిపాటు

Exit mobile version