NTV Telugu Site icon

Hardik Pandya – Natasa : హార్దిక్ తో విడాకులపై క్లారిటీ ఇచ్చిన నటాషా స్టాంకోవిచ్..?

Hardik Pandya Natasa

Hardik Pandya Natasa

Hardik Pandya – Natasa Stankovic: గత ఆరు నెలల నుంచి టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా మధ్య ఏం జరుగుతుందన్న విషయంపై సర్వర్త చర్చలు జరుగుతున్నాయి. వీరిద్దరూ ఎందుకు వేరువేరుగా ఉంటున్నారు..? టి20 ప్రపంచ కప్ టీమ్ ఇండియా గెలిచిన తర్వాత కూడా నటాషా హార్దిక్ కోసం ఎందుకు ఆలోచించలేదు..? అంటూ వీరిద్దరిపై అభిమానులు ఎన్నో ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇకపోతే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటాషా గత కొద్ది కాలంగా ఎక్కువ అప్డేట్స్ ఇవ్వడం లేదు. తాజాగా ఆవిడ తనపై వస్తున్న ట్రోల్స్ పై స్పందించింది. నటాషా ఆమెపై వచ్చిన ట్రూల్స్ పై స్పందిస్తూ.. ఎవరైనా వ్యక్తిత్వం లేకుండా ప్రవర్తించినప్పుడు మనం దానిని చూడడం లేదా వారిపై సానుభూతి చూడడంతో ఆగిపోతుంది. ఏం జరిగిందో దాని వెనుక ఉన్న పరిస్థితి ఏంటో.. అని తెలియకుండానే చాలామంది తీర్పు చెప్పేస్తుంటారు అంటూ తెలిపింది.

Mahesh Babu: అనంత్, రాధిక పెళ్లికి ‘సూపర్ స్టార్’.. హాలీవుడ్ హీరోలా మహేష్ బాబు!

ఇకపోతే తను మాత్రం ఏం జరిగినా తన పాత్రలో తాను నటిస్తూనే ఉంటానంటూ చెప్పుకొచ్చింది. వేరొకరి జీవితంలో జరిగే విషయాలపై తక్షణమే తీర్పు ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేసింది. అసలు వారిని ఎందుకు అలా చేస్తున్నారో..? ఆ సమయంలో వారి మధ్య విభేదాలు ఎలా ఉన్నాయో..? వారి ఆలోచనలు ఏమిటో..? తెలియకుండానే ఎలా మాట్లాడుతారో అంటూ కాస్త ఘాటుగానే స్పందించింది. అలాంటి సమయంలో అందరూ ఒపీకగా ఉండే అన్న విషయాలు అదంతటగా అవే బయటకు వస్తాయంటూ చెప్పకు వచ్చింది. ఇకపోతే తాజాగా హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్య ఈ విషయంపై స్పందిస్తూ గత ఆరు నెలలుగా హార్దిక్ పాండ్య క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పుకొచ్చాడు.

Harish Rao: మీరు పరిష్కరించాల్సిన సమస్యలు ఇవే.. సీఎం రేవంత్ కు హరీష్‌ రావు లేఖ..

హార్దిక్, నటాషాలు మే 2020లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ 2023లో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో రెండు వేరువేరు ఆచారాల ప్రకారంగా పెళ్లిళ్లు చేసుకున్నారు. వాటికీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా ప్రముఖ మీడియా నివేదిక ప్రకారం.. వీరిద్దరూ చాలా కాలంగా తమ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. గడిచిన 6 నెలలుగా మీరు వైవాహి జీవితంలో ఎన్నో వడిదుడుకులు అయ్యాయని అతి త్వరలోనే దంపతులు విడిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది.

Show comments