NASA Plane Crash: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్లింగ్టన్ ఎయిర్ పోర్టులో మంగళవారం ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. NASAకు చెందిన అత్యాధునిక WB-57 పరిశోధనా విమానం ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం కారణంతో ల్యాండింగ్ గేర్ పనిచేయలేదు. దీంతో విమానాన్ని చక్రాలు లేకుండానే రన్ వే పై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసాడు పైలెట్.
రన్ వే పై విమానం కింది భాగంతో దూసుకు వెళ్లిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ల్యాండింగ్ సమయంలో విమానం నేలను తాకగానే భారీ శబ్దం రావడంతో పాటు.. కింద నుంచి మంటలు, తెల్లటి పొగలు ఎగసిపడినట్లు వీడియోల్లో కనిపించింది. కొంతదూరం వరకు రన్‌వేపై వెళ్లిన విమానం, వేగం తగ్గి చివరకు క్షేమంగా నిలిచిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఇద్దరు క్రూ సభ్యులు సురక్షితంగా బయటపడటం నిజంగా అదృష్టమే.
OnePlus 16 Leaks: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, ఇంకా ఎన్నెన్నో.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షేకే ఇగ!
ఈ ఘటనపై NASA అధికారికంగా స్పందిస్తూ.. విమానంలో ఉన్న సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదంటూ స్పష్టం చేసింది. ల్యాండింగ్ సమయంలో ఎదురైన మెకానికల్ సమస్యపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని తెలిపాయి. ఇక ఘటన జరిగిన సెకెన్ల వ్యవధిలోనే ఫైర్ బ్రిగేడ్ బృందాలు, ఎమర్జెన్సీ సర్వీసులు రన్‌వే వద్దకు చేరుకుని భద్రతా చర్యలు చేపట్టాయి. ఈ ఘటన టెక్సాస్ లోని హ్యూస్టన్ కు ఆగ్నేయంగా ఉన్న ఎల్లింగ్టన్ ఎయిర్ పోర్టులో జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను చూసిన నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. అయితే ప్రాణనష్టం జరగకపోవడంతో ఆనందం వ్యక్తం చేశారు.
60-YEAR-OLD NASA PLANE BURSTS INTO FLAMES ON LANDING pic.twitter.com/6cWdwLF8rG
— RT (@RT_com) January 27, 2026