Woman Beat Man : డమ్మీ పిస్టల్ తో దమ్కీ .. పడేసి కుమ్మేసిన వీరనారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Beat Man : మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్‌లో ఓ మహిళ ఓ వ్యక్తిని కర్రలతో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సమయంలో స్థానిక ప్రజలు కూడా అక్కడ నిలబడి, మొత్తం సంఘటనను వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఆ వ్యక్తి ఆమెను నకిలీ పిస్టల్, కత్తెర చూపి బెదిరిస్తున్నాడని, దీంతో ఆ మహిళ అతడిని కొట్టింది. ప్రస్తుతం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని తమతో పాటు తీసుకెళ్లి తదుపరి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
Read Also:Harish Rao: మూడు నెలల పెండింగ్ జీతాలు చెల్లించండి.. హరీష్ రావు డిమాండ్
Also Read
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
- పండుగ వేళ టయోటా ధమాకా ఆఫర్.. Toyota Glanza Facelift విడుదల.. రూ. 6.99 లక్షల నుంచే ప్రారంభం..
- Tollywood Star Daughters: కొడుకులే కాదు.. తండ్రుల లెగసీని మోస్తున్న టాలీవుడ్ వారసురాళ్లు..!
ఈ ఘటన మే 29వ తేదీ సాయంత్రం జరిగింది. ఆ మహిళ కరేలి నగరంలోని నర్సింగ్ వార్డులో నివాసి. రెండు రోజుల క్రితం తన భర్త నిద్రిస్తుండగా అదే వ్యక్తి వచ్చి రూ.12వేలు, మొబైల్ ఫోన్‌తో పారిపోయాడని, ఆ మహిళ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పింది సమాచారం అందుకున్న పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడి కోసం గాలింపు ప్రారంభించి కాసేపటికే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు నిందితుడిని తమ వెంట తీసుకెళ్లి దారిలో వదిలేశారు.
Read Also:Vishwak Sen : బాలయ్య నటి అంజలిని తోసేసిన ఘటనపై స్పందించిన విశ్వక్ సేన్..
మరుసటి రోజు ఆ మహిళ అదే నిందితుడిని వంతెన కింద చూసింది. నిందితుడు మహిళను ప్లాస్టిక్ పిస్టల్, కత్తెర చూపించి బెదిరించడం మొదలుపెట్టారు. కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలని లేకుంటే హత్య చేస్తానని మహిళను బెదిరించాడు. దీంతో ఆమె కోపం నషాలానికి ఎక్కింది. ఈ క్రమంలో ఆ మహిళ సమీపంలో పడి ఉన్న కర్రను అందుకుని యువకుడిని కొట్టడం ప్రారంభించింది. ఇది చూసి స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. విషయం చూసిన ప్రజలు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని తమతో పాటు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
-
Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
-
పండుగ వేళ టయోటా ధమాకా ఆఫర్.. Toyota Glanza Facelift విడుదల.. రూ. 6.99 లక్షల నుంచే ప్రారంభం..
-
Tollywood Star Daughters: కొడుకులే కాదు.. తండ్రుల లెగసీని మోస్తున్న టాలీవుడ్ వారసురాళ్లు..!
-
Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!