Site icon NTV Telugu

DC vs KKR: ఐపీఎల్‌ చరిత్రలో 2వ అత్యధిక స్కోరు.. ఢిల్లీ లక్ష్యం ఎంతంటే?

Dc Vs Kkr

Dc Vs Kkr

DC vs KKR: విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ 2024 16వ మ్యాచ్‌లో కేకేఆర్‌ బ్యాటర్లు సిక్సర్ల, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఢిల్లీ ముందు 273 పరుగుల భారీ లక్ష్యాన్ని కేకేఆర్ ఉంచింది. కోల్‌కతా బ్యాటర్లు చెలరేగి ఆడడంతో ఐపీఎల్ చరిత్రలో 2వ అత్యధిక స్కోరును సాధించారు. ఒకానొక దశలో సన్‌రైజర్స్ రికార్డు(277)ను అధిగమిస్తారనే అంచనాలు కూడా నెలకొన్నాయి. చివరి ఓవర్‌లో ఇషాంత్ అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయడంతో రికార్డు స్కోర్‌ను కేకేఆర్‌ అధిగమించలేకపోయింది.

కేకేఆర్ బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనింగ్ బ్యాటర్‌ సునీల్ నరైన్ తన తుఫాను బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. నరైన్ బ్యాట్ నుంచి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసింది. అనుభవజ్ఞుడైన ఢిల్లీ బౌలర్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌తో కేకేఆర్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ మెరుపులు మెరిపించాడు. ఇషాంత్ వేసిన ఒక ఓవర్‌లో నరైన్ 26 పరుగులు చేసి కేవలం 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. సునీల్ నరైన్ ఆరంభం నుంచే అద్భుతమైన ఫామ్‌లో కనిపించడంతో ఢిల్లీ బౌలర్లను సీరియస్‌గా తీసుకున్నాడు. విస్ఫోటన శైలితో ఆడుతూ కేకేఆర్ స్కోరును కేవలం 3.5 ఓవర్లలోనే నరైన్ యాభై దాటించాడు. నరైన్ బ్యాట్‌తో చాలా విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్‌ 2024లో తన మొదటి అర్ధ సెంచరీని కేవలం 21 బంతుల్లో పూర్తి చేశాడు. సునీల్ నరైన్‌ 39 బంతుల్లో 85 పరుగులు చేశాడు. మరో కేకేఆర్‌ బ్యాటర్‌ రఘువంశీ 27 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. రఘువంశీ 25 బంతుల్లోనే అర్ధశతకం బాదడం గమనార్హం. విధ్వంసకర బ్యాటర్ ఆండ్రీ రస్సెల్‌ తన ప్రతాపంతో అభిమానులను మరోసారి అలరించాడు. రస్సెల్ 19 ఓవర్లలోనే 41 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో నోర్జే 3 వికెట్లు, ఇషాంత్ శర్మ 2 వికెట్లు, అహ్మద్‌ ఖలీల్ ఒకటి, మిచెల్‌ మార్ష్‌ ఒక వికెట్ తీయగలిగారు.

Read Also: Mango production: ఈ ఏడాది మామిడి పంటకు తిరుగులేదు.. పెరగనున్న దిగుబడి..

Exit mobile version