NTV Telugu Site icon

Vijayawada: పున్నమి ఘాట్లో నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమం.. హాజరైన నారా భువనేశ్వరి, బ్రాహ్మణి

Bhuvaneshwari

Bhuvaneshwari

విజయవాడ పున్నమి ఘాట్లో నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో పలువురు మహిళా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హాజరయ్యారు. ఆమెతో పాటు.. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి, మంత్రులు అనిత, సవిత, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. పలువురు అఖిల భారత సర్వీసు అధికారుల సతీమణులు, వివిధ రంగాల మహిళా ప్రముఖులు, మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మరోవైపు.. విద్యుత్ కాంతులతో విజయవాడ పున్నమీ ఘాట్ శోభాయమానంగా ఉంది. దసరా పండుగ విశిష్టత చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Sabarimala: అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త..

ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. దసరా పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తారు.. పండుగ చేసుకోవడమంటే సంస్కృతి, సంప్రదాయాలను పాటించడమేనని అన్నారు. ప్రతి పండుగకూ ఓ ప్రత్యేకత ఉంటుంది.. స్త్రీ శక్తిని తెలియచెప్పేదే దసరా పండుగ అని తెలిపారు. టెక్నాలజీ యుగంలో ఆడబిడ్డల విజయాలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి.. మహిళలు అంతరిక్షాలకు వెళ్తున్నారు.. రాజకీయాల్లో రాణిస్తున్నారని అన్నారు. దేశానికి ఓ గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయం.. మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తున్నా.. ఇప్పటికీ మహిళలపై చిన్న చూపు ఉందని పేర్కొన్నారు. కొన్ని అపోహలు, అలవాట్ల వల్ల మహిళా శక్తిని పూర్తిగా సమాజం ఉపయోగించుకోవడం లేదు.. మహిళా సాధికారత అనేది జరగాలని భువనేశ్వరి తెలిపారు. మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది.. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది.. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆద్‌దేనని అన్నారు. ఆడబిడ్డల కోసం తిరుపతిలో తొలి మహిళా యూనివర్శిటీని ప్రారంభించింది అన్న ఎన్టీఆర్.. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలను తమ కాళ్లపై నిలబడేలా చంద్రబాబు కృషి చేశారన్నారు. మహిళలు ఏదైనా చేయగలరు.. ఎస్ వియ్ కెన్ డూ ఇట్ అని వ్యాఖ్యానించారు.

KCR : తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరా పండుగకు ప్రత్యేక స్థానముంది

హెరిటేజ్ నేను నడపగలనా అని తనకు అనుమానం కలిగిందని భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు నాయుడు తనను ప్రోత్సహించారు.. హెరిటేజ్‌లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను.. కానీ తాను చేయగలనా అని మనస్తైర్యంతో ముందుకు సాగానని చెప్పారు. మహిళలు యొక్క శక్తిని వారు గ్రహించాలి.. ప్రతి ఒక్క సామాన్య స్త్రీ తనకు ఇన్స్పిరేషన్ అని అన్నారు. పాలు అమ్మే రైతు నుండి వ్యాపారం చేసే మహిళ వరకు ప్రతి మహిళ తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు. చేనేత కార్మికులు వారు చేసే చేనేత హస్తకళ నైపుణ్యం ఎంతో గొప్పది.. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించాలని కోరుకుంటున్నాను.. రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు అందరూ చేనేత వస్త్రాలను ధరించాలన్నారు. వారంలో ఒక్కసారైనా చేనేత వస్త్రాలను ధరించాలని నారా భువనేశ్వరి తెలిపారు.