Narendra Modi : మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ర్ట సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాన మంత్రి పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్ల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను సిఎస్ ఆదేశించారు.
ప్రధాన మంత్రి 4వ తేదీన ఆదిలాబాద్, మార్చి 5వ తేదీన సంగారెడ్డిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు రెండు చోట్ల బహిరంగ సభల్లో కూడా ప్రసంగిస్తారని ఆమె తెలిపారు. అందుకు అనుగుణంగా బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు ప్రధాన కార్యదర్శి సూచించారు. విమానాశ్రయం, హెలిప్యాడ్లతో పాటు అన్ని వేదికల వద్ద తగినన్ని అగ్నిమాపక వాహనాలు ఏర్పాటు చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులకు ఆదేశించారు. అవసరమైన వైద్య సదుపాయాలు ఏర్పాట్లు చేయాలని, ఆరోగ్య శాఖ అధికారులను కోరారు.
Also Read
- Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
- Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
- 8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
- UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
ప్రధానమంత్రి కాన్వాయ్ పర్యటించే మార్గాలలో రోడ్లు పరిశీలించాలని ఏ వైన మరమ్మత్తులు ఉంటే యుద్దప్రాతిపధికన పూర్తి చేయాలని పోలీసు, GHMC, రోడ్లూ భవణాల శాఖల అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటించే అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని విధ్యుత్ శాఖను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, ప్రధానమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా చూడాలని సూచించారు.
తాజావార్తలు
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!