NTV Telugu Site icon

Narendra Modi : హెల్త్‌కేర్‌పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు.!

Pm Narendra Modi

Pm Narendra Modi

ప్రధాని మోడీ ‘ఆరోగ్యం, వైద్య పరిశోధన’ వెబినార్‌లో మాట్లాడారు. ‘ఆరోగ్య సంరక్షణను కరోనాకు ముందు తర్వాత అని చూడాలి. పోస్ట్ పాండమిక్‌లో హెల్త్‌కేర్‌పై దృష్టి మరింత పెరిగింది. నగదు రహిత ఆరోగ్య బీమా పథకం వల్ల రోగులకు దాదాపు రూ.80వేల కోట్ల హెల్త్కేర్ ఆదా అయింది. దీంతోపాటు జన్ ఔషధి కేంద్రాల్లో రోగులు జనరిక్ మందులు కొనుగోలు చేయడం ద్వారా వారు రూ.20వేల కోట్లు ఆదా చేసుకున్నారు’ అని మోడీ తెలిపారు. గడిచిన సంవత్సరాల్లో 260కి పైగా మెడికల్ కాలేజీలు ప్రారంభించామని, 2014 తర్వాత మెడికల్ సీట్ల సంఖ్య రెట్టింపు అయ్యిందని, మెడికల్ కాలేజీల దగ్గర 157 కొత్త నర్సింగ్ కాలేజీలు ప్రారంభించడం వైద్య మానవ వనరులకు పెద్ద ముందడుగు అని ఆయన అన్నారు.

Harish Rao : తెలంగాణా తరహా రైతు పథకాలపై ఇతర రాష్ట్రాల ఆసక్తి

ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 80 వేల కోట్లు ఖర్చు చేయకుండా ఆదా చేసినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. అలాగే భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో నర్సింగ్‌ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. పౌరుల ఇళ్ల దగ్గర పరీక్షా సౌకర్యాలు, ప్రథమ చికిత్స కోసం మెరుగైన సౌకర్యాలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని శ్రీ మోదీ హైలైట్ చేశారు. COVID-19 గురించి మాట్లాడుతూ, మహమ్మారి సమయంలో భారతదేశ ఫార్మా రంగం మొత్తం ప్రపంచం యొక్క నమ్మకాన్ని సంపాదించిన విధానం అపూర్వమని అన్నారు. సరఫరా గొలుసు చాలా ముఖ్యమైన విషయంగా మారిందని మహమ్మారి నేర్పిందని ఆయన అన్నారు.

Also Read : Business Headlines 06-03-23: మహిళలకు ఇప్పుడు బంగారం మీద లేదంట మోజు. మరిన్ని వార్తలు