Narendra Modi: కేంద్రంలో కొత్త ప్రభుత్వం మరో రెండు మూడు రోజుల్లో కొలువుదీరనుంది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో వరుసగా మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు ఎన్డీయే కూటమి నేతలతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు కూడా హాజరుకానున్నారు.
Read Also: 8 Vasanthalu Movie Update: మీరు తనని రేపు చూస్తారు.. ‘8 వసంతాలు’ ఇంట్రెస్టింగ్ పోస్టర్!
ఇక, మంగళవారం నాటి ఫలితాల్లో ఎన్డీయే కూటమికి స్పష్టమైన ఆధిక్యం రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు తగిన ఏర్పాట్లు స్టార్ట్ చేశారు. ఇప్పటికే ప్రధాని మోడీ నివాసంలో కేంద్ర కేబినెట్ చివరిసారిగా సమావేశం నిర్వహించింది. ప్రస్తుత 17వ లోక్‌సభ రద్దుకు రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. బుధవారం సాయంత్రం ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతల కీలక భేటీని నిర్వహించారు. ఇందులో కూటమి నేతలు మోడీని ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. శుక్రవారం బీజేపీ, ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతలు సమావేశం కానున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఎన్డీయే కొత్త ఎంపీలతో కలిసి మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవనున్నారు.
Read Also: Miss You First Look: ‘మిస్ యూ’ ఫస్ట్ లుక్ విడుదల.. సరికొత్తగా సిద్దార్థ్!
కాగా, పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ అధినేతలకు భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం పలికి ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఇండియన్ గవర్నమెంట్ నుంచి రణిల్ విక్రమసింఘేకు ఆహ్వానం అందిందని శ్రీలంక అధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. అలాగే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మోడీ ఫోన్లో మాట్లాడారని, ప్రమాణ స్వీకారకార్యాక్రమానికి ఆహ్వానించారని దౌత్య వర్గాలు పేర్కొన్నాయి.
