Site icon NTV Telugu

PM Modi: రిజర్వేషన్లు రద్దు, మతం ఆధారంగా విభజించడం జరగదు..

Pm Modi

Pm Modi

PM Modi: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రచారంలో బిజీబిజీగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తనదైన శైలిలో విపక్షాలపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ (మంగళవారం) రాజస్థాన్‌లోని టోంక్- సవాయి మాధోపూర్‌లో జరిగిన మీటింగ్ లో మోడీ.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే.. నేటికి అక్కడ జవాన్లపై రాళ్ల దాడులు కొనసాగుతునే ఉండేవి అన్నారు. ప్రజలు మెచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం తీసుకొచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు.

Read Also: TS Inter Results 2024: రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు..

ఇక, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మన సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు జరిగేది కాదని నరేంద్ర మోడీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే దేశంలో ఎక్కడో ఒక చోట బాంబు పేలుళ్లు జరిగేవన్నారు. రాజస్థాన్ లో వరుస పేలుళ్ల నిందితులను కాంగ్రెస్ కాపాడి పాపానికి పాల్పడిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే అవినీతికి కొత్త మార్గాలను అన్వేషిస్తుంది.. కాంగ్రెస్ హయాంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలు రాజస్థాన్ నెంబర్-1 స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. అలాగే, తనకు దేశ ప్రజలందరి ప్రేమ, ఆశీస్సులు, ఉత్సాహం లభించాయని ప్రధాని మోడీ చెప్పారు. ఈ రోజు హనుమాన్ జయంతి శుభ సందర్భంగా.. ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని నరేంద్ర మోడీ వెల్లడించారు.

Read Also: Peddireddy Ramachandra Reddy: నా గురించి తప్పుగా మాట్లాడితే ప్రజలే ఓట్లతో సమాధానం ఇస్తారు

కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులు, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను విచ్ఛిన్నం చేసి వారి ప్రత్యేక ఓటుకు ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుకున్నారని ప్రధాని మోడీ తెలిపారు. అయితే, రాజ్యాంగం దానికి పూర్తిగా వ్యతిరేకం అన్నారు. దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులకు బాబా సాహెబ్ అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్ హక్కును మత ప్రాతిపదికన ముస్లింలకు ఇవ్వాలని ఇండియా కూటమి కోరుతుంది.. కాంగ్రెస్ చేస్తున్న ఈ కుట్రలకు.. దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులకు రిజర్వేషన్లు రద్దు చేయడం గానీ, మతం ఆధారంగా విభజించడం గానీ కుదరదు అని ప్రధాని మోడీ తెలిపారు.

Exit mobile version