Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 – ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో అహ్మదాబాద్‌లో ఫార్మా రంగంపై జరిగిన ప్రత్యేక రౌండ్‌టేబుల్ సమావేశంలో రాష్ట్ర ఐటీ, విద్యా, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఉత్సాహంగా పాల్గొని, పారిశ్రామికవేత్తలను ఏపీకి సాదరంగా ఆహ్వానించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ఫార్మా దిగ్గజాలతో జరిగిన ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను ఆయన వివరించారు.
ఈ సందర్భంగా నక్కపల్లిలో అత్యాధునిక హంగులతో అభివృద్ధి చేస్తున్న ‘బల్క్ డ్రగ్ పార్క్’ ప్రాజెక్ట్ విశిష్టతలను మంత్రి లోకేష్ పారిశ్రామిక వర్గాలకు తెలిపారు. దేశంలోనే ఫార్మా రంగానికి కేంద్ర బిందువుగా మారుతున్న ఈ పార్కులో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. క్లస్టర్ మోడల్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని, తద్వారా తయారీ రంగం మరింత బలపడుతుందని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
- AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
- Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
- Yanamala Krishnudu: తుని రాజకీయాల్లో కీలక పరిణామం.. జనసేనలో చేరిన యనమల కృష్ణుడు!
కేవలం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కాకుండా.. అత్యంత వేగంగా అనుమతులు మంజూరు చేసే ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని తమ ప్రభుత్వం అమలు చేస్తోందని లోకేష్ పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సింగిల్ విండో విధానంలో అతి తక్కువ సమయంలోనే అన్ని అనుమతులు ఇస్తామని భరోసా కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, నిపుణలైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశానికి ఫార్మా రంగానికి చెందిన పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై, ఏపీలో పెట్టుబడులపై సానుకూలంగా స్పందించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యేలా ఈ పర్యటన దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!