NTV Telugu Site icon

Nara Bhuvaneswari: అసెంబ్లీకి సీఎం చంద్రబాబు.. నారా భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్

Nara Bhuvaneswari

Nara Bhuvaneswari

Nara Bhuvaneswari: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టడంపై ఆయన సతీమణి భువనేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. ‘నేడు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు! నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది.. ప్రజలకు ప్రణామం!’ అంటూ ట్వీట్ చేశారు. వైసీపీ హయాంలో తన కుటుంబ సభ్యులను అవమానించారంటూ శపథం చేసి వెళ్లిపోయారు చంద్రబాబు. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని ఆయన చెప్పారు. ఈ రోజు చంద్రబాబు అసెంబ్లీకి రావడంతో ఆయన సతీమణి భువనేశ్వరి సంతోషపడ్డారు. ఆనాడు చంద్రబాబు శపథం చేసిన వీడియోను ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఆమె చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Read Also: TG Cabinet : రైతులకు గుడ్‌ న్యూస్‌.. పంట రుణాల మాఫీకి గ్రీన్‌ సిగ్నల్‌

Show comments