Site icon NTV Telugu

Indigo Flight: నారా భువనేశ్వరి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య..

Flight

Flight

Vijayawada: గన్నవరం వచ్చిన ఇండిగో విమానం ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టించింది. ల్యాండింగ్ అవుతున్న సమయంలో రన్ వే మీదకు వచ్చి.. మళ్లీ గాల్లోకి ఎగిరింది. దీంతో విమానం లోపల ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురైన ప్రయాణికులు.. బెంబెలెత్తిపోయారు. సరిగ్గా విమానం ల్యాండింగ్ సమయంలో వీల్ తెరుచుకోలేదు.

Read Also: Hemant Soren: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యే ఛాన్స్.. నెక్ట్స్ సీఎం ఎవరంటే..!

విషయాన్ని తెలుసుకున్న పైలట్ విమానాన్ని మళ్లీ టేకాఫ్‌ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాసేపు గాల్లో ఎగిరిన తరువాత తిరిగి వీల్ బయటకు రావడంతో సేఫ్‌ ల్యాండింగ్ చేశారు పైలట్. కాగా.. ఇదే విమానంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి.. నారా భువనేశ్వరితో పాటు అధికారులు, ప్రయాణికులు ప్రయాణించారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Read Also: TDP: ఫేక్ పోస్టింగులతో తలపట్టుకుంటున్న టీడీపీ..

Exit mobile version