నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరీర్లో ఫుల్ స్వాగ్‌లో ఉన్నాడు. ఇటీవల ‘హిట్ 3’తో మాస్ ఆడియన్స్‌ను మెప్పించిన నాని, ఇప్పుడు అంతకు మించిన పవర్ఫుల్ మాస్ సినిమా ‘ది ప్యారడైజ్’తో వస్తున్నాడు. ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో, సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా నుంచి రాబోయే ఫస్ట్ సింగిల్ కోసం మేకర్స్ టైమ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read :Roshan Meka : ఒక్క హిట్‌తో ఇద్దరు బడా నిర్మాతల దృష్టిలో పడ్డ రోషన్..
2026 మార్చి 26న సినిమా రిలీజ్ కానుండటంతో, ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలని టీమ్ భావిస్తోంది. ఇందులో భాగంగానే జనవరి రెండో వారం లేదా మూడో వారంలో మొదటి పాటను విడుదల చేసే అవకాశం ఉందట. ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడయ్యాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి సందడి తర్వాత ఈ పాటను వదిలితే బజ్ మరింత పెరుగుతుందని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో నాని లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా, రా అండ్ రస్టిక్‌గా ఉండగా. ఒకపక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుండగానే, మరోపక్క సాంగ్ అప్డేట్తో సోషల్ మీడియాను షేక్ చేయడానికి టీమ్ సిద్ధమవుతోంది. మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో, నాని మాస్ స్టెప్పులతో థియేటర్లు ఎలా దడదడలాడతాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!