Site icon NTV Telugu

Taraka Ratna Wife: తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి అస్వస్థత

Maxresdefault (1)

Maxresdefault (1)

Taraka Ratna Wife: నందమూరి తారకరత్న కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్య అలేఖ్య రెడ్డితో పాటు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ క్రమంలోనే తారకరత్న భార్య అస్వస్థతకు గురయ్యారు. ఎంతగానో ప్రేమించి పెళ్లాడిన భర్త మరణ వార్తను జీర్ణించుకోలేని అలేఖ్యను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. తారకరత్న మరణించారని వైద్యులు ధ్రువీకరించినప్పటి నుంచి ఆమె కంటతడి ఆరడం లేదు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ధైర్యం చెబుతున్నప్పటికీ తారకరత్న అకాల మరణాన్ని ఆమె తట్టుకోలేకపోతున్నారు.

Read Also: Tarakaratna Daughter: బాలయ్యను చూసి పరిగెత్తుకెళ్లి హత్తుకున్న తారకరత్న కూతురు

40ఏళ్ల వయసులోనే చిన్న పిల్లలను వదిలి తారకరత్న లోకాన్ని విడియిపోవడాన్ని ఆమె తట్టుకోలేకున్నారు. భర్త మరణ వార్త విన్నప్పటినుంచి ఆహారం తీసుకోకుండా రోదిస్తూనే ఉంది. దీంతో ఆమె అస్వస్థతకు గురైంది. అలేఖ్య అస్వస్థతకు గురైన విషయంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. కొంత మానసిక ఒత్తిడికి లోనవుతుందని తెలిపారు. కాళ్లు, చేతులు కొంచెం వణకడం మొదలైందని.. అయితే అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. అమితంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోవడం చిన్న విషయం కాదని.. కొంతకాలం ఒడిదుడుకులు ఉంటాయని చెప్పారు.

Exit mobile version