NTV Telugu Site icon

Mokshagna: మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసిన బాలయ్య.. ఇప్పట్లో లేనట్టే?

Mokshagna Entry Movie Confirmed

Mokshagna Entry Movie Confirmed

Nandamuri Mokshagna Debut confirmed by Balakrishna: నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఎప్పుడు అనేది చాలా కాలం నుంచి నెవర్ ఎండింగ్ టాపిక్ లా మారిపోయింది. మోక్షజ్ఞ అసలు ఎలాంటి కథతో వస్తున్నాడు? ఏ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు? అనే ప్రశ్నలు ప్రతీ నందమూరి అభిమానుల మదిలో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి. నిజానికి నందమూరి బాలకృష్ణ “ఆదిత్య 369”కి సీక్వెల్ చేయడానికి చాలా కాలంగా ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. 1991లో విడుదలైన ఈ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికీ ఒక క్లాసిక్ గా పరిగణించబడుతుంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన “ఆదిత్య 369” సినిమలో శ్రీకృష్ణ దేవరాయలు సహా బాలకృష్ణ రెండు పాత్రల్లో నటించారు.

Aishwarya Rajinikanth: ఆ హీరోతో ప్రేమలో పడ్డ రజనీకాంత్ కూతురు.. మళ్ళీ పెళ్ళికి రెడీ?

ఇక ఈ సినిమా సీక్వెల్‌లో మోక్షజ్ఞ హీరోగా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ముందు నుంచి ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు ఆ వార్తలను బాలకృష్ణ ధ్రువీకరించారు. ఆదిత్య 369 సీక్వెల్‌లో తన కొడుకు మోక్షజ్ఞను పరిచయం చేస్తానని నందమూరి బాలకృష్ణ ఇటీవల ఫిలడెల్ఫియాలో ముగిసిన తానా కన్వెన్షన్‌లో ఆఫ్-ది రికార్డ్ గా మాట్లాడుతూ వెల్లడించారు. వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు. ఈ సీక్వెల్‌లో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఆయన కుమారుడు మోక్షజ్ఞ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇక సినీ ఎంట్రీ కోసమే మోక్షజ్ఞ లుక్స్ పై మరింత కేర్ తీసుకుని సహజ పద్ధతుల్లో లా స్లిమ్ గా అయి అందరికీ షాక్ ఇచ్చాడు.

Show comments