NTV Telugu Site icon

Balakrishna: దెబ్బకు దెబ్బ తీస్తాం.. మేము ఎవరికి భయపడం..!

Balakrishna

Balakrishna

నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ పార్టీ పొలిటికల్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన చోటే పీఏసీ రెండవ మీటింగ్ ఇక్కడ నిర్వహించాం అని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ ను తట్టుకోలేక కొంతమంది మృతి చెదారు.. వాళ్ళ కుటుంబాలను పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. 3, 4 కోర్టులో జడ్జిమెంట్ ఉన్నాయి.. జడ్జిమెంట్ వచ్చిన తరువాత చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తాము అని బాలకృష్ణ పేర్కొన్నారు.

Read Also: Rahul Gandhi: ఒకవైపు మహాత్మా గాంధీ, మరో వైపు గాడ్సే..ఎంపీ ప్రచారంలో రాహుల్ గాంధీ..

నా చెల్లి నారా భువనేశ్వరి కూడా ఈ దీక్షలో కూర్చుంటారు అంటూ నందమూరి బాలకృష్ణ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహీ యాత్రకు టీడీపీ తరపున మా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము అని ఆయన పేర్కొన్నారు. మా పార్టీ తరఫున ఐదు మందిని, జనసేన తరుఫున 5మందీతో కమిటీ వేస్తామని చెప్పారు. దెబ్బకు దెబ్బ తీస్తాం.. మేము ఎవరికి భయపడం అని బాలయ్య అన్నారు. ఫైబర్ గ్రిడ్ కేసు పెడతామంటున్నారు.. నేను ఛాలెంజ్ చేస్తున్న ఫైబర్ గ్రిడ్ లో అవినీతి జరిగినట్లు నిరూపించాలి.. రాష్ట్ర అభివృద్ధిని సీఎం జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేశారు అంటూ బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏ ఆధారం ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు అంటూ బాలకృష్ణ అన్నారు. రాజకీయ కక్షతో చంద్రబాబును అరెస్ట్ చేశారు అని ఆయన తెలిపారు.