Nandamuri Balakrishna: హిందీ భాషపైన నాకున్న సత్తా ఏంటో చూపించా.. బాలయ్య బాబు వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna’s Bhagavanth Kesari Movie to release in Hindi Soon: అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ నటించగా.. శ్రీలీల ముఖ్య పాత్రలో కనిపించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. భగవంత్ కేసరి సినిమా ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి అదరగొట్టింది. ఈ చిత్రం విజయోత్సవం గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడుతూ భగవంత్ కేసరి సినిమా త్వరలో హిందీలో విడుదలకానుందని తెలిపారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ… ‘భగవంత్ కేసరి సినిమా త్వరలో హిందీలో కూడా రాబోతుంది. ప్రయోగం చేయడం ఎప్పుడూ అలవాటు, నాన్న గారి నుంచే నాకు ఈ అలవాటు. తొలిసారి హిందీలో డబ్బింగ్ చెప్పాను. నా సొంత గొంతు అరువు ఇచ్చాను. త్వరలోనే సినిమా రిలీజ్ అవుతుంది. హిందీ భాషపైన నా పటిమ ఎలా ఉంటుందో చూస్తారు. తెలుగువాళ్ల సత్తా ఏంటో ఈ సినిమా నిరూపిస్తుంది’ అని అన్నారు. హిందీ భాషపైన తనకున్న సత్తా ఏంటో చూపించా అని బాలయ్య బాబు పేర్కొన్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
‘ఒక మంచి సినిమాని ఇచ్చినప్పుడు ప్రేక్షకులు నీరాజనాలు పలికారంటే.. అంతకుమించిన సంపాదన, సంతోషం మరొకటి లేదు. వైవిధ్యమైన పాత్రల్ని చేసే దమ్ము, ధైర్యం, నమ్మకం మా నాన్న గారి నుంచి వచ్చిన వారసత్వం. భగవంత్ కేసరి పాత్రల కోసం నటీనటులు ఎంతో కష్టపడ్డారు. సాంకేతిక నిపుణులు కూడా. నా సినిమాలకి నా సినిమాలే పోటీ. విభిన్నమైన పాత్రలు, నిర్మాతలకి నాపైన ఉన్న నమ్మకం, దర్శకులు నన్ను మలిచే కోణం, రచయితలు నాతో పలికించే మాటల ఫలితమే ఈ విజయ పరంపర. మాలో చాలా మందికి ఈ సినిమా ప్రత్యేకం’ అని బాలకృష్ణ చెప్ప్పారు.
#BhagavanthKesari Hindi release soon!#Balakrishna himself dubbed his voice for Hindi version pic.twitter.com/PQ8ZAFdzUD
— Daily Culture (@DailyCultureYT) November 9, 2023
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!