NTV Telugu Site icon

Nandamuri Balakrishna: హిందీ భాషపైన నాకున్న సత్తా ఏంటో చూపించా.. బాలయ్య బాబు వీడియో వైరల్!

Balakrishna, Kajal

Balakrishna, Kajal

Balakrishna’s Bhagavanth Kesari Movie to release in Hindi Soon: అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ నటించగా.. శ్రీలీల ముఖ్య పాత్రలో కనిపించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. భగవంత్ కేసరి సినిమా ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి అదరగొట్టింది. ఈ చిత్రం విజయోత్సవం గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడుతూ భగవంత్ కేసరి సినిమా త్వరలో హిందీలో విడుదలకానుందని తెలిపారు.

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ… ‘భగవంత్ కేసరి సినిమా త్వరలో హిందీలో కూడా రాబోతుంది. ప్రయోగం చేయడం ఎప్పుడూ అలవాటు, నాన్న గారి నుంచే నాకు ఈ అలవాటు. తొలిసారి హిందీలో డబ్బింగ్‌ చెప్పాను. నా సొంత గొంతు అరువు ఇచ్చాను. త్వరలోనే సినిమా రిలీజ్ అవుతుంది. హిందీ భాషపైన నా పటిమ ఎలా ఉంటుందో చూస్తారు. తెలుగువాళ్ల సత్తా ఏంటో ఈ సినిమా నిరూపిస్తుంది’ అని అన్నారు. హిందీ భాషపైన తనకున్న సత్తా ఏంటో చూపించా అని బాలయ్య బాబు పేర్కొన్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: PAK vs ENG: ఇంగ్లండ్‌ జట్టును డ్రెస్సింగ్ రూమ్‌లో పెట్టి తాళం వేయండి.. వసీం అక్రమ్‌ మాస్టర్‌ ప్లాన్‌!

‘ఒక మంచి సినిమాని ఇచ్చినప్పుడు ప్రేక్షకులు నీరాజనాలు పలికారంటే.. అంతకుమించిన సంపాదన, సంతోషం మరొకటి లేదు. వైవిధ్యమైన పాత్రల్ని చేసే దమ్ము, ధైర్యం, నమ్మకం మా నాన్న గారి నుంచి వచ్చిన వారసత్వం. భగవంత్ కేసరి పాత్రల కోసం నటీనటులు ఎంతో కష్టపడ్డారు. సాంకేతిక నిపుణులు కూడా. నా సినిమాలకి నా సినిమాలే పోటీ. విభిన్నమైన పాత్రలు, నిర్మాతలకి నాపైన ఉన్న నమ్మకం, దర్శకులు నన్ను మలిచే కోణం, రచయితలు నాతో పలికించే మాటల ఫలితమే ఈ విజయ పరంపర. మాలో చాలా మందికి ఈ సినిమా ప్రత్యేకం’ అని బాలకృష్ణ చెప్ప్పారు.

Show comments