NTV Telugu Site icon

Nandamuri Balakrishna: ‘గోల్డెన్ లెగసీ’ అవార్డును అందుకున్న నందమూరి నటసింహం..

Bala Krishna

Bala Krishna

Nandamuri Balakrishna ‘Golden Legacy’ Award at IIFA Utsavam 2024: ఐఫా ఉత్సవం 2024 అబుదాబిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారతదేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అనేకమంది హీరోహీరోయిన్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శుక్రవారం రాత్రి ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగగా.. వివిధ కేటగిరీలలో సీనియర్ హీరోలు అవార్డులను దక్కించుకున్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవికి ‘ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా’ అవార్డును దక్కించుకోగా.. టాలీవుడ్ బడా హీరో నందమూరి నటసింహంగా పేరుపొందిన బాలకృష్ణ ” గోల్డెన్ లెగిసి” అవార్డును అందుకున్నారు.

Also Read: Megastar Chiranjeevi: మెగాస్టార్‭ను వరించిన మరో ప్రతిష్టాత్మక అవార్డు..

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి అందుకున్న సమయంలో టాలీవుడ్ బడా హీరోలు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి ఒకే స్టేజిపై కనబడడంతో అభిమానులు తెగ ఆనంద పడిపోతున్నారు. అక్కినేని నాగార్జున కూడా ఉండి ఉంటే మరింత బాగుండేది అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు.

Also Read: Devara: యూఎస్ లో రికార్డు వసూళ్లు కొల్లగొట్టేస్తున్న దేవర

Show comments