Balayya : దిల్ రాజు బ్యానర్ లో మలయాళ దర్శకుడితో బాలయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి, త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే, గోపీచంద్ మలినేని సినిమా తర్వాత బాలయ్య మరో షాకింగ్ ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read : Akkineni Akhil : తాత కాబోతున్న ‘అక్కినేని అఖిల్’..
Also Read
- Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
- India At UN: పాక్‌కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
- Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ 'స్టాండప్ కామెడీ'.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
మలయాళంలో ‘మార్కో‘ చిత్రంతో భారీ సంచలనం సృష్టించిన యువ దర్శకుడు హనీఫ్ అదేనీ చెప్పిన కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. హనీఫ్ అదేనీ తన మేకింగ్ స్టైల్‌తో యాక్షన్ సినిమాలకు సరికొత్త డెఫినిషన్ ఇస్తారనే పేరుంది. ఇప్పుడు బాలయ్య మార్క్ మాస్ ఎనర్జీకి హనీఫ్ స్టైలిష్ యాక్షన్ తోడైతే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌ను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్లో అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ పై నిర్మించనున్నాడట. బాలయ్య మరియు దిల్ రాజు కాంబినేషన్లో సినిమా కోసం నందమూరి అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. హనీఫ్ అదేనీ కథలోని ఇంటెన్సిటీ బాలయ్యకు బాగా నచ్చడంతో, ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖాయమైనట్లేనని ఫిలిం నగర్ వర్గాల టాక్. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబందించి అదిరాకారక ప్రకటన రావాల్సి ఉంది. ఈ కాంబో ఫిక్స్ అయితే మాత్రం బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అనే చెప్పాలి. తెలుగుతో పాటు మలయాళంలోను తెరకెక్కించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
-
India At UN: పాక్‌కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
-
Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!