NTV Telugu Site icon

Hanu Man: హనుమాన్‌ స్పెషల్ స్క్రీనింగ్‌కు బాలకృష్ణ.. ప్రశాంత్‌ వర్మపై ప్రశంసలు!

Balakrishna Hanu Man

Balakrishna Hanu Man

Nandamuri Balakrishna Watch Hanu Man Movie: టాలీవుడ్‌ యువ హీరో తేజ సజ్జా నటించిన తాజా సినిమా ‘హనుమాన్‌’. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్బుత కలెక్షన్లతో దూసుకెళ్తోంది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన హనుమాన్‌ సినిమా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే వంద కోట్ల మైలురాయిని దాటిన ఈ చిత్రం.. అటు అమెరికాలో 3 మిలియన్ డాలర్లు వసూళు చేసింది. ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మేకింగ్, తేజా సజ్జా యాక్టింగ్ అద్భుతమని కొనియాడుతున్నారు.

హనుమాన్‌ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌కు ‘నటసింహం’ బాలకృష్ణ హాజరయ్యారు. సినిమా చూసిన అనంతరం ప్రశాంత్‌ వర్మపై బాలయ్య బాబు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడున్న టెక్నాలజీని బాగా వాడుకున్నావని, బోలడంత కంటెంట్ ఉందన్నారు. సినిమా కన్నుల పండగగా ఉందని, అందరూ బాగా యాక్ట్ చేశారని బాలకృష్ణ పేర్కొన్నారు. హనుమాన్‌ రెండో పార్ట్ కోసం తాను ఎదురుచూస్తున్నా అని బాలయ్య బాబు చెప్పారు. బాలకృష్ణ, ప్రశాంత్‌ వర్మ, నిర్మాత నిరంజన్‌ రెడ్డి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: IND vs AFG: మరొక్క విజయం.. అంతర్జాతీయ టీ20లో చరిత్ర సృష్టించనున్న భారత్‌!

హనుమాన్‌ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కే నిరంజన్‌ రెడ్డి తెరకెక్కించారు. గౌరా హరి-అనుదీప్ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ సంయుక్తంగా మ్యూజిక్‌ అందించారు. ఈ సినిమాలో అమృతా అయ్యర్‌ కథానాయికగా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషించారు.

Show comments